https://oktelugu.com/

Viral News : ఈ మిషన్ మనుషులకు స్నానం చేయిస్తుంది.. చివరికి ఆ పని కూడా చేస్తుంది

సుఖం ఎక్కువైతే..ముఖం కడగడానికి తీరిక ఉండదు.. వెనుకటి కాలంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న సామెత ఇది. ఇప్పటి కాలంలో ఇది నిజం అవుతోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పై సామెతను అనేక సందర్భాల్లో వాస్తవరూపం దాల్చాలా చేస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2024 / 10:07 PM IST
    Follow us on

    Viral News :  ఒక మనిషి మహా అయితే 15 నుంచి 20 నిమిషాల మధ్యలో స్నానాన్ని పూర్తి చేస్తాడు. ఈ స్నానం చేయడం కూడా ఆర్థిక స్థోమతను బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది షవర్ బాత్ చేస్తారు. ఇంకొంతమంది టబ్ బాత్ చేస్తారు. బాగా బలిసిన వాళ్లయితే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టుకుంటూ స్నానం చేస్తారు. పిండి కొద్ది రొట్టె అన్నట్టు.. డబ్బు కొద్ది స్నానం. అయితే ఎంత డబ్బున్నా.. ఎవరి స్నానం వారే చేసుకోవాలి. కాకపోతే కొన్ని కొన్ని మిషన్లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మర్దన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో జపాన్ కంపెనీ ఓ అద్భుతాన్ని చేసింది. దుస్తులు ఉతికి.. ఆరవేసే యంత్రాలు మాదిరిగానే.. మనుషులను కూడా ఉతికి ఆరవేసే యంత్రాలను తయారు చేసింది. టెస్టింగ్ దశను ఈ యంత్రాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. భవిష్యత్తు కాలంలో ఈ యంత్రాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. అలసట వల్ల స్నానం చేయడానికి ఓపిక లేకపోతే.. ఆ వ్యక్తి మెషిన్ టబ్ లో కూర్చుంటే చాలు.. 15 నిమిషాలలో శుభ్రమైన శరీరంతో బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కృత్రిమ మేధ ద్వారా ఈ బాత్ టబ్ పనిచేస్తుంది. ఇందులో కూర్చున్న వ్యక్తి శరీరాన్ని, చర్మాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగా వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ నిర్ణయించుకొని పనిచేస్తుంది. దీనిని సైన్స్ లో కంపెనీ తయారు చేసింది. ఇది జపాన్ దేశానికి చెందిన కంపెనీ. ఇటీవల ఒసాకా కన్సాయ్ నిర్వహించినప్పుడు.. ఈ కార్యక్రమానికి హాజరైన వెయ్యిమంది అతిధులకు ఈ యంత్రం ద్వారా స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.. ఈ యంత్రం ద్వారా స్నానం చేయడాన్ని అతిధులు అద్భుతంగా ఆస్వాదించారు..” మా శరీరానికి పట్టిన మైల మొత్తం పోయింది. చర్మం స్వచ్ఛంగా ఉంది. తళ తళ మెరుస్తోంది. ఈ యంత్రం గొప్ప ఆవిష్కరణ అంటూ” ఆ కార్యక్రమానికి వచ్చిన అతిథులు పేర్కొన్నారు.

    మాస్ ప్రొడక్షన్ వర్షన్

    టెస్టింగ్ దశను విజయవంతంగా పూర్తి చేసుకోవడం.. ట్రయల్ దశను అద్భుతంగా అధిగమించడంతో.. దీనికి సంబంధించిన మాస్ ప్రొడక్షన్ వర్షన్ విడుదల చేస్తామని సైన్స్ కో కంపెనీ చైర్మన్ ఆయోమా చెబుతున్నారు. ” భవిష్యత్తు కాలం ఎలా ఉంటుందో తెలియదు. మనుషుల అవసరాలు ఎలా మారుతాయో తెలియదు. అందువల్లే ఈ మిషన్ రూపొందించాల్సి వచ్చింది. అయితే దీని ఆకృతి 50 సంవత్సరాల క్రితం నాటిది. దీనిని మార్చాల్సి ఉందని” సైన్స్ కో కంపెనీ చెబుతోంది. ఇక 1970లో జపాన్ వరల్డ్ సాన్యో ఎలక్ట్రిక్ కో (ఇప్పటి పానాసోనిక్) దీనిని రూపొందించింది. అయితే కొత్త వర్షంలో ఎక్కువగా మసాజ్ బాల్స్ ను అమర్చారు.

    ఇలా పనిచేస్తుంది

    యంత్రం ఫైటర్ జెట్ కాక్ పీట్ ఆకారంలో ఉంటుంది. అలా రూపొందించిన ప్లాస్టిక్ ప్యాడ్ లోకి మనిషి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా అది సగానికి పైగా వేడి + చల్లని నీటితో నిండిపోతుంది. ఆ తర్వాత హై స్పీడ్ జెట్స్ పనిచేస్తాయి. స్నానం చేసేటప్పుడు ఆహ్లాదమైన అనుభూతిని ఇవి అందిస్తాయి. మసాజ్ బాల్స్ చివరికి వీపు కూడా తోముతాయి. స్నానం పూర్తయిన తర్వాత ఇందులో ఉన్న నీరు మొత్తం డ్రైనేజీ లైన్ కు కనెక్ట్ చేసిన పైపు ద్వారా బయటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కొత్త వ్యక్తి ఇందులో ఒక ప్రవేశిస్తే మళ్ళీ అదే విధానంలో స్నానం చేయిస్తుంది.