Viral Video : సాధారణంగా చనిపోయిన మృతదేహాలు స్మశాన వాటికలో ప్రాణం పోసుకోవడం సినిమాల్లో చూస్తుంటాం. చనిపోయారని భావించి అంత్యక్రియలకు సిద్ధపడితే శవాలు లేచి కూర్చోవడం వంటి ఘటనల గురించి కూడా విన్నాం. కానీ ఓ వృద్ధుడు చనిపోయాడని పూడ్చిపెట్టారు. అక్కడికి నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని బయటకు తీస్తే ఆ వృద్ధుడు బతికాడు. వినడానికి వింతగా ఉంది కదా ఈ ఘటన. ఇది ముమ్మాటికీ వాస్తవం. మోల్డోవా అనే యూరప్ దేశంలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఘటన.
మాల్డోవా అనే దేశంలో ఉష్టియ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 70 సంవత్సరాల వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. విచారణలో భాగంగా ఆ వృద్ధురాలు ఇంటిని పరిశీలించారు అక్కడ పోలీసులు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పాటు.. ఇంట్లో నేల నుంచి వ్యక్తి మూలుగుతున్నట్లు శబ్దాలు వచ్చాయి. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అక్కడే నేల మాళిగ ఒకటి బయటపడింది. అందులో 75 సంవత్సరాల వృద్ధుడు కనిపించాడు. ఆయన శరీరంపై గాయాలు కనిపించాయి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు వృద్ధుడు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
వృద్ధుడికి 18 సంవత్సరాల యువకుడు సమీప బంధువు. ఇద్దరూ కలిసి ఇంట్లోనే మద్యం సేవించారు. వారి మధ్య ఏదో విషయంపై వాగ్వవాదం జరిగింది. మాట మాట పెరిగి క్షణికావేశానికి గురైన యువకుడు వృద్ధుడిపై దాడి చేశాడు. ఆ సమయంలో వృద్ధుడి భార్య అడ్డంగా రావడంతో ఆమెపై సైతం దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది.దీంతో విషయం బయటకు వస్తుందని తెలిసి తీవ్ర గాయాలతో ఉన్న వృద్ధుడిని నేల మాళిగలో పెట్టి యువకుడు పరారయ్యాడు.ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి నిలకడగా ఉంది. దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి పోలీసులు చెబుతున్నారు.
BREAKING: A 62-year-old man in Moldova was found alive after being buried for four days.
Police discovered him while investigating the murder of a 74-year-old woman, when they heard noises from the ground near her house.
Digging at the site, they uncovered a makeshift grave… pic.twitter.com/TEn1e9Shwo
— Apex Episodes (@ApexEpisodes) May 16, 2024