Largest Banyan Tree : ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇవి మనుషులకు ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా ఇస్తుంది. చెట్లు ఉండటం వల్ల ప్రకృతి పచ్చగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. మనుషులు అందరికీ కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. ఇండియాలో కొన్ని చెట్లను దేవునితో కొలుస్తారు. కొన్ని చెట్లను ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే మన ఇండియాలో ఎన్నో పెద్ద చెట్లు ఉంటాయి. అందులో మర్రి చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ చెట్టుకు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అయితే ప్రపంచంలోని అతి పెద్ద మర్రి చెట్టు మన దేశంలోనే ఉంది. మిగతా చెట్లతో పోలిస్తే మర్రి చెట్టు ఎంతో పెద్ది. అందులో ప్రపంచంలోని అతిపెద్ద మర్రి చెట్టు ఏపీలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి అనే చిన్న గ్రామంలో తిమ్మమ్మ మరిమాను అని ఆ మర్రి చెట్టును పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా పేరు పొందిన ఇది మొత్తం 5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ భారీ మర్రి చెట్టు 19,107 చదరపు మీటర్ల పందిరి ఉంటుంది. అయితే ఈ చెట్టు వెనుక ఓ స్టోరీ కూడా ఉంది. అసలు ఈ చెట్టుకి తిమ్మమ్మ మారిమాను అనే పేరు ఎలా వచ్చింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
తిమ్మమ్మ మరిమాను అనే పేరుకు పాత కాలం నుంచి స్థల పురాణాలున్నాయి. 15వ శతాబ్దంలో తిమ్మమ్మ అనే మహిళ తన భర్త అంత్యక్రియల చితిపై తన జీవితాన్ని అర్పించే ఆచారాన్ని చేపట్టింది. అయితే వీటిని కాల్చిన చెక్క నుంచి ఒక చిన్న మొక్క మొలకెత్తింది. మొక్కగా పుట్టిన అది చివరికి పెద్ద మర్రి చెట్టుగా మారింది. దీంతో ఆ మర్రి చెట్టుకు ఆమె పేరు పెట్టారు. తిమ్మమ్మ మరిమను భక్తికి, త్యాగానికి ప్రతీకగా భావించి పవిత్రంగా ఆ చెట్టును పూజిస్తారు. అయితే ఈ మర్రి చెట్టుకు ఓ స్పెషాలిటీ ఉంది. పిల్లలు కోరుకునే జంటలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. వారు వివిధ పట్టణాల నుండి వచ్చి ఈ చెట్టును పూజిస్తారు. ఇది చెట్టు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. తిమ్మమ్మ మరిమాను కేవలం ఒక పెద్ద చెట్టుగా మాత్రమే కాదు.. స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రకమైన మర్రి చెట్లు ప్రకృతిని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటి బలమైన మూలాలు నేల కోతను నిరోధించడంలో బాగా సహాయపడతాయి.
పెద్ద కొమ్మలు ఉన్న జంతువులు నివసించడానికి ఈ చెట్టు బాగా సహాయపడుతుంది. అలాగే ఎన్నో పక్షులు, గబ్బిలాలు, కీటకాలు, చిన్న క్షీరదాలు ఆశ్రయం కోసం చెట్టుపై ఆధారపడతాయి. ఇది స్థానిక వన్యప్రాణులు విషయంలో బాగా సహాయపడుతుంది. తిమ్మమ్మ మరిమాను సంవత్సరాలుగా ఎన్నో తుఫానులు వచ్చినా కూడా చెట్టు అలాగే ఉంది. అయితే ఈ చెట్టులో ఆత్మలు లేదా దేవతలు నివసిస్తారని చాలా మంది నమ్ముతారు. ఈ చెట్టు కింద రాత్రిపూట నిద్రపోవడం చాలా ప్రమాదకరమని కూడా అంటుంటారు. అయితే దీనికి వెనుక ఓ కారణం ఉంది. ఎందుకంటే చెట్లు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఇవి ఆక్సిజన్ స్థాయిలని తగ్గిస్తుంది. దీని వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందదు. అలాగే మర్రి చెట్లను సజీవ శవపేటికలు అని కూడా అంటారు. అందుకే నిద్రపోకూడదని చెబుతుంటారు. అయితే ఈ తిమ్మమ్మ మరిమాను చెట్టు 550 సంవత్సరాలకు పైగా తుఫానులు నుంచి బయటపడింది. ఈ చెట్టు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంది.