Viral Video : గోట్ జీవితాన్ని కాపాడిన నువ్వు నిజంగా GOAT వే బ్రో!

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. చూస్తుంటే ఆ యువకుడి చేసిన పనికి సెల్యూట్ చెప్పాలనిపిస్తోంది. పైగా అతడు నాకెందుకు అనుకోలేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మేకలను కాపాడాడు.

Written By: NARESH, Updated On : May 7, 2024 4:51 pm

The video of the man who saved the goat's life went viral

Follow us on

Viral Video : ఈ భూమ్మీద పరోపకారాన్ని మించింది లేదు. తోటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు చేయందిస్తే అంతకు మించిన గొప్ప గుణం మరొకటి ఉండదు. అందుకే మానవసేవ మాధవసేవ అంటారు.. అయితే కొన్ని పురాణాలు మనుషుల కంటే జంతువులకు సేవ చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చెబుతున్నాయి. మరి ఆ పురాణాలు చదివాడో.. లేక పక్కన జంతువులు కష్టాల్లో ఉంటే చూడలేకపోయాడో తెలియదు గానీ.. ఈ కథనం కింది లింకులో ఉన్న వీడియోలో ఓ యువకుడు చేసిన పరోపకారం మాత్రం ఆ జంతువుల ప్రాణం నిలబెట్టింది. చావు చివరి అంచుల దాకా వెళ్ళిన ఆ జంతువులకు పున: ప్రాణం పోసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ట్విట్టర్ ఎక్స్ లో అమేజింగ్ నేచర్ అనే ఐడి నుంచి ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రోడ్డు వెంట కొన్ని మేకలు వెళ్తున్నాయి. అందులో కొన్ని మేకలు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నాయి. అవి అచేతన స్థితిలో ఉన్నాయి. అలా వెళ్తున్న ఓ యువకుడు వాటిని చూశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మేకలను చూసి తట్టుకోలేక చలించి పోయాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వాటి దగ్గరికి వెళ్ళాడు. మేకల మెడలపై కొన్ని తాళ్లు ఉండటం గమనించాడు. ఆ తాళ్లల్లో ఒక మేక కాలు ఇరుక్కుపోయింది. మరో మేక మెడ బిగుసుకుపోయింది. దీంతో అతడు అతి కష్టం మీద ఆ తాడును తొలగించాడు. ముందుగా కాళ్లు ఇరుక్కున్న మేకను తెలివిగా బయటకు తీశాడు. మరో మేక మెడ బిగుసుకుపోతే.. దాన్ని కూడా జాగ్రత్తగా తొలగించాడు. ఒక మేక తాడు బిర్రుగా కావడంతో శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. దానిని అలానే రోడ్డు పక్కన పడుకోబెట్టి.. దాని నోరు తెరిచి.. ఆ యువకుడు తన నోటి ద్వారా కృత్రిమ శ్వాస అందించాడు.. దీంతో ఆ మేక ఆ ఊపిరి తీసుకొని నడవడం మొదలుపెట్టింది.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. చూస్తుంటే ఆ యువకుడి చేసిన పనికి సెల్యూట్ చెప్పాలనిపిస్తోంది. పైగా అతడు నాకెందుకు అనుకోలేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మేకలను కాపాడాడు. అదే అతడి స్థానంలో ఇంకెవరైనా ఉంటే.. ఆ మేకలు అలా చస్తే.. ఇంటికి తీసుకెళ్లి వాటి మాంసాన్ని వండుకునేవారు. ఏది ఏమైనప్పటికీ ఆ యువకుడు చేసిన పని పట్ల సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.. గొప్ప పని చేసావ్ బ్రో అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.