Viral Video : పరీక్షల్లో విద్యార్థులు వింత వింత సమాధానాలు రాయడం చూస్తున్నాం. కొంత మంది సినిమా స్టోరీ, పిట్ట కథలు రాయడం చూస్తుంటాం. కొందరు టీచర్లక షాకిచ్చే ఆన్సర్స్ రాస్తుంటారు. తాజాగా ఓ అణిముత్య విద్యార్థి రాసిన ఓ ఆన్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నవ్వకుండా ఉండలేం. మనకు ఇష్టమైన వారిని, ప్రేమించిన వారిని గుండల్లో దాచుకుంటాం. ఇదే విషయాన్ని ఓ విద్యార్థి పరీక్షలో ఆన్సర్ రాసి టీచర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్..
మీమ్స్ అండ్ కనెక్షన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఆ సమాధానం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. గుండె చిత్రాన్ని గీసి.. దాని విధులను విశ్లేషించండి అనే ప్రశ్నకు సమాధానంగా ఈ రొమాంటిక్ స్టూడెంట్ ఏకంగా తనదైన శైలిలో సమాధానం రాశాడు. గుండె బొమ్మ గీయడంతోపాటు అదులోని గదుల్లో ప్రియ, రూప, హరిత, పూజ, నమిత అనే పేరు గల అమ్మాయిలు ఉన్నారని చక్కగా వివరించాడు. అంతేకాకుండా ప్రియ అనే అమ్మాయి తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేస్తుందని, ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. ఇక రూప తనతో స్నాప్ చాట్‌లో మెసేజ్‌లు చేస్తుందని, చాలా అందంగా ఉంటుందని తెలిపాడు. నమిత తన పొరుగింట్లో ఉంటుందని, ఆమె జుట్టు పొడవుగా, కళ్లు పెద్దగా ఉంటాయని రాసుకొచ్చాడు. పూజ తన మాజీ ప్రేయసి అని ఆమెను మర్చిపోలేకపోతున్నానని చెప్పాడు. ఇక, చివరిగా హరిత తన క్లాస్‌మేట్ అని స్పష్టం చేశాడు.
టీచర్ షాక్..
ఈ సమాధానం చూసి కచ్చితంగా టీచర్ షాక్ అయ్యే ఉంటాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. లక్షల్లో లైకులు వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు పొట్టచక్కలయ్యేలా నవ్వడమే కాకుండా.. కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.