Seema Chintakaya benefits: ఎండాకాలంలో మామిడి పండ్లు, సపోటా పండ్లు, పుచ్చకాయలు, కర్పూజ, ముంజలు, నేరేడు పండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో లభిస్తుంటాయి. వీటిల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదాలు కాబట్టి ఇవి తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. సహజ చక్కెరలు ఇందులో విస్తారంగా ఉంటాయి. అందువల్లే దేహం ఎదుగుదలకు ఇవి తోడ్పడుతుంటాయి. వైద్యులు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు.
అజీర్ణం నుంచి మొదలు పెడితే రక్తపోటు వరకు ఇలాంటి అనేక సమస్యలకు ఈ పండ్లు పరిష్కార మార్గాన్ని చూపుతాయి. ఈ మాట సాక్షాత్తు వైద్యులే అంటున్నారు. అందువల్లే పండ్లను ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పైగా ఎండకాలంలో ఈ పండ్లు ఎక్కువగా లభిస్తుంటాయి కాబట్టి.. తినడం వల్ల శరీర వృద్ధి మెరుగ్గా ఉంటుంది. రోగ నిరోధక శక్తి సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు జీవనక్రియలు సాఫీగా సాగిపోతూ ఉంటాయి.
ఎండాకాలంలో దొరికే అన్ని పండ్ల కంటే సీమ చింతకాయలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ పండ్లు ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు లభించడం తగ్గిపోయింది. పైగా కొన్ని ప్రాంతాలలో ఈ పండ్లను సేకరించి నగరాలలో అమ్ముతున్నారు. ఈ పండ్లు గుత్తులకు గుత్తులు ఉంటాయి. పక్వానికి వచ్చిన పండ్లు గులాబీ రంగులో ఉంటాయి. తీయగా నోటికి అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఇందులో ఉండే గింజలు నలుపు రంగులో ఉంటాయి. ఈ పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చూస్తాయి. రక్తంలో ఉన్న ఫ్యాట్ ను కరిగేలా చేస్తాయి. ఎముకల వృద్ధికి తోడ్పడుతాయి. ముఖ్యంగా విటమిన్ కె, ఏ ను సమృద్ధిగా అందిస్తాయి.
సీమ చింతకాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఒక విధంగా.. పక్వానికి వచ్చినప్పుడు మరొక విధంగా ఉంటాయి. వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో సీమ చింత చెట్లు అధికంగా ఉంటాయి. దీనికి సీమ చింత అనే పేరు వచ్చింది. కొన్ని ప్రాంతాలలో వీటిని గుబ్బ కాయలు అని కూడా పిలుస్తారు. ఎండాకాలంలో ఇవి గనక దొరికితే ఖచ్చితంగా తినేయండి. ఎందుకంటే ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలం. ఎండాకాలంలో మాత్రమే లభిస్తుంది.