Uttar Pradesh: దేవుళ్ళలో రాముడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మహావిష్ణువు అవతారమైన రాముడు ఎంతో సౌమ్యుడు. ఆయనలా ఉండాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. అందుకే రామ భజన చేస్తూ ఉంటారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక రామాలయాలు ఉన్నాయి. ప్రతి శ్రీరామనవమికి ప్రత్యేకంగా ఈ ఆలయాల్లో వేడుకలు నిర్వహిస్తారు. అలాగే ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం నిర్మించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు ఇదే ఉత్తర ప్రదేశ్ లో రాముడు విగ్రహం ఆకర్షిస్తుంది. మనీ కాయిన్స్ తో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఘన్ రిపబ్లిక్ మాల్ లో లక్షన్నర నాణేలతో రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఎత్తు 18 అడుగులుగా ఉంది. ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి రూ.1,5,10 నాణేలను ఉపయోగించారు. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అత్యంత అద్భుతమైన ఈ విగ్రహాన్ని పూర్తి చేయడానికి 20 రోజుల సమయం పట్టింది. లక్నో, గోరఖ్ పూర్, కోల్కతా కు చెందిన 25 మంది నిపుణులైన కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఇలాంటి విగ్రహం ఇప్పటివరకు తయారు చేయలేదు. అందుకే ఇది ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయింది. దీపావళి సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రదేశాలకు ఉంచారు.
లక్షన్నర కాయిన్స్ తో ఏర్పాటు అయినా ఈ విగ్రహాన్ని చూసేందుకు లక్నో తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఈ షాపింగ్ మాల్ సందడిగా మారింది. అంతేకాకుండా ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవభూమికి ప్రత్యేకగా ఉత్తరప్రదేశ్ ను పిలుచుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిలో అయోధ్య రామాలయం తో పాటు కాశి విశ్వేశ్వర స్వామి వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినవారు తాజాగా ఏర్పాటు చేసిన కాయిన్స్ విగ్రహాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. ఇప్పటివరకు రాముడి విగ్రహాలు సాధారణంగానే ఉండేవి. కానీ మొదటిసారిగా మనీ కాయిన్స్తో తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే ఎక్కడా లేనివిధంగా అయోధ్యలో బాల రాముడిని ఏర్పాటు చేసి.. ఇప్పుడు కాయిన్స్ తో శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఇలాగే కొనసాగిస్తారా? ఎప్పటి వరకు ఈ విగ్రహం ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది.
లక్షన్నర కాయిన్లతో రాముడి విగ్రహం
లక్నో ఫన్ రిపబ్లిక్ మాలో 18 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహం ఆకట్టుకుంటోంది.
25 మంది కళాకారులు 20 రోజులు కష్టపడి తీర్చిదిద్దిన ఈ విగ్రహం ఏషియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.#SriRamudu #RamStatue #Lucknow pic.twitter.com/GyiYKS8RJ7
— greatandhra (@greatandhranews) October 8, 2025