https://oktelugu.com/

Troll A Project: ఊహకందని నిర్మాణం.. సముద్రంపై అతిపెద్ద కట్టడం.. Troll A ప్రాజెక్టు గురించి తెలిస్తే షాక్ అవుతారు..

Troll A పేరుతో నార్వే దేశం చేపట్టిన నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 1996 సంవత్సరంలో స్లాటాయిల్ సంస్థ నార్వే దేశంలోని వాట్స్ అనే గ్రామం నుంచి ఉత్తర సముద్రం వరకు 200 కిలోమీటర్ల ఈ నిర్మాణాన్ని చేపట్టారు.

Written By: , Updated On : February 14, 2025 / 05:00 AM IST
Troll A Project

Troll A Project

Follow us on

Troll A Project: ఈ భూమి మీద మానవుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఆకాశాన్ని తాటేలా నిర్మాణాలు చేస్తున్నాడు. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుండడంతో అక్కడ ఇక్కడ అని కాకుండా ఏకంగా సముద్రంలోనూ నిర్మాణాలు చేపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకప్పుడు ఒక చిన్న కుటీరం ప్రేమించడానికి ఎంతో శ్రమతో పాటు సమయం కూడా చాలా పట్టేది. కానీ ఇప్పుడు సాంకేతికతను ఉపయోగించి ఎవరూ ఊహించని విధంగా ఏకంగా సముద్రంలో నిర్మాణాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నార్వే దేశంలో చేపట్టినా ఓ నిర్మాణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నిర్మాణం సముద్రం మధ్యలో చేయడమే కాకుండా ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మాణంగా ప్రసిద్ధి చెందింది. దీని వివరాలు తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. ఆ నిర్మాణం వివరాల్లోకి వెళితే..

Troll A పేరుతో నార్వే దేశం చేపట్టిన నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 1996 సంవత్సరంలో స్లాటాయిల్ సంస్థ నార్వే దేశంలోని వాట్స్ అనే గ్రామం నుంచి ఉత్తర సముద్రం వరకు 200 కిలోమీటర్ల ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా పేరుంది. దీని ఎత్తు 472 మీటర్లు. అంటే 1,549 అడుగులు. బరువు 6,83,600 టన్నులు. సముద్ర మట్టానికి 303 మీటర్ల లోతులో నుంచి దీనిని నిర్మించారు. మొత్తం నాలుగు పెద్ద సిలిండరికల్ కాంక్రీట్ పిల్లర్లుగా నిర్మించిన ఇది ఒక ఎలివేటర్ ను కలిగి ఉంది. సముద్రం నుంచి ఈ పిల్లల్ల పైకి వెళ్లడానికి 9 నిమిషాల సమయం పడుతుంది. ఇవి సముద్ర అలలు ఎంత ఒత్తిడిని కలిగించినా తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఈ పిల్లర్లు ఒక మీటర్ కంటే ఎక్కువగా మందంతో ఉంటాయి. వీటిని రింఫార్డ్స్ కాంక్రీట్ తో తయారు చేయబడ్డాయి. ఈ పిల్లల పైన ఎక్కువ వ్యాసాన్ని కలిగి ఉంటుంది.

ఈ నిర్మాణాన్ని షెల్ కోసం నిర్మించారు. 1991లో 650 ప్రారంభమైన ఇది 1995లో పూర్తి చేయబడింది. ఆ తర్వాత ఇది 1996లో అతిపెద్ద ఆప్షోర్ గ్యాస్ ఫ్లాట్ ఫామ్ గా గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. 2006లో 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించి మరో రికార్డును సృష్టించారు. ఈ ప్రాజెక్టులో ఉన్న 40,000 నుంచి గ్యాస్ పైకి వచ్చి అనేక పైపుల ద్వారా సరఫరా అవుతుంది. సహజవాయును వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా దీనిని నిర్మించి రికార్డు నెలకొల్పారు. 2010లో ట్రోల్ ఏ ఈ ను కొత్త మార్బుల్ తో విస్తరించారు. ఆ సమయంలో దీనిపై లివింగ్ రూమ్ తో పాటు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 2013 జూన్ 18న ట్రోల్ ఏ బోర్డులో కంప్రెసర్లు మూడు, నాలుగు కొత్త సపోర్టు మాద్యుల్స్ ను ఎత్తివేశారు. 2014 సంవత్సరంలో మరోసారి దీని గురించి వెలుగులోకి వచ్చింది. భూమి ఉపరితలంపై నిర్మించిన అతి ఎత్తైన కట్టడం గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఈ క్వినార్ నిర్వహిస్తోంది.