Homeవింతలు-విశేషాలుKerala influencer Ashwani income: విష్ణు ప్రియ కాదు.. ఇన్ ప్లూయన్సర్ గా ఈమె ...

Kerala influencer Ashwani income: విష్ణు ప్రియ కాదు.. ఇన్ ప్లూయన్సర్ గా ఈమె సంపాదన నెలకు కోటి పైగానే..

Kerala influencer Ashwani income: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. దీనికి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ తోడైంది. దీంతో సెలబ్రిటీలు సంపాదన మొదలుపెట్టారు. రెచ్చగొట్టే ఫోటోలు.. అంతకుమించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. చెల్లింపులు చేసిన వారికి అందాల విందు ఇస్తున్నారు. ఇటీవల విష్ణు ప్రియ అంశం వివాదం కావడంతో.. ఒక్కసారిగా సెలబ్రిటీల సబ్స్క్రయిబ్ వ్యవహారం చర్చకు వచ్చింది.

తెలుగులో సబ్స్క్రైబ్ ద్వారా ఎంతోమంది మహిళా సెలబ్రిటీలు దండిగా సంపాదిస్తున్నారు. విష్ణు ప్రియ పేరు మాత్రమే బయటపడింది. ఇలా పేర్లు బయటపడని వారు చాలామంది ఉన్నారు. వారంతా కూడా నెలకు లక్షలలో సంపాదిస్తున్నారు. అది నైతికమా.. అనైతికమా విషయాలను పక్కన పెడితే.. ఇన్ ప్లూయన్సర్స్ సంపాదిస్తున్న తీరు ఒక రేంజ్ లో ఉంది. ఓ నివేదిక ప్రకారం ఐటీ కంపెనీలో సీఈఓ స్థాయి సంపాదనను మహిళా ఇన్ ప్లూయన్సర్స్ వెనకేసుకుంటున్నారు.

ఒక్కో సబ్స్క్రైబర్ కు ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేస్తున్నారు. తద్వారా రెచ్చగొట్టే ఫోటోలు.. అంతకుమించిన వీడియోలను పోస్ట్ చేస్తూ విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. ఇన్ ప్లూయన్సర్స్ సాగిస్తున్న దందాపై రకరకాల విమర్శలు ఉన్నప్పటికీ.. సంపాదన అనేసరికి ఇన్ ప్లూయన్సర్స్ నైతికత పాటించడం లేదు. పైగా బి గ్రేడ్ స్థాయి కంటే దిగజారి రెచ్చగొట్టే ఫోటోలు.. అంతకుమించిన వీడియోలను పోస్ట్ చేస్తూ.. తమకు డబ్బు చెల్లించిన వారికి అందాల విందు తీస్తున్నారు.

ఇటీవల విష్ణు ప్రియ వ్యవహారం తెరపైకి రావడంతో.. ఇన్ ప్లూయన్సర్స్ గురించి చర్చ మొదలైంది. అయితే మనదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో కేరళ రాష్ట్రానికి చెందిన అశ్విని అనే యువతీ భారీగా సంపాదిస్తోంది. ఈమె అత్యంత ధనికమైన ఇన్ ప్లూయన్సర్ గా రూపాంతరం చెందింది.. ఈమె ప్రతినెలకు కోటి రూపాయల వరకు సంపాదిస్తోంది. ఒక్కో సబ్స్క్రైబర్ 399 రూపాయలు చెల్లించాలి. ఈమెకు దాదాపు 25,900 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రతినెల ఆమెకు వచ్చే ఆదాయం కోటి మూడు లక్షల 34వేల 100 రూపాయల వరకు ఉంటుంది. అశ్విని ఎత్తుకు ఎత్తు.. అందానికి అందంగా ఉంటుంది.. రెచ్చగొట్టే ఫోటోలు పెడుతుంది. కైపు కలిగించే వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె మాట్లాడే మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. అందువల్లే ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నట్టు.. ఈమె తనకు డిమాండ్ ఉన్నప్పుడే ఈ తరహాలో సంపాదనకు శ్రీకారం చుట్టింది. కోట్లల్లో సంపాదిస్తూ సరికొత్త ట్రెండ్ ను అమలు చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular