Prakash Anna funny skit: పరుగు సినిమా చూశారా.. అందులో ప్రకాష్ రాజ్ పెద్ద కూతురు.. అల్లు అర్జున్ స్నేహితుడు ప్రేమించుకుంటారు. వారిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అయితే వారిద్దరు పారిపోవడానికి అల్లు అర్జున్ కారణమని భావించి ప్రకాష్ రాజ్ కుటుంబ సభ్యులు.. అతడిని బంధిస్తారు. తమ ఇంట్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత వారిద్దరి ఆచూకీ కోసం అల్లు అర్జున్ ను చాలా ప్రాంతాలు తిప్పుతారు. కొన్ని సందర్భాలలో అతనిపై దాడి కూడా చేస్తారు.. వాస్తవానికి పారిపోయిన వారిద్దరూ బాగానే ఉంటారు..ఎటొచ్చీ అల్లు అర్జున్ కు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అమ్మాయి కుటుంబ సభ్యులు నిత్యం మాత్రమే వేధిస్తూనే ఉంటారు.
వాస్తవానికి ప్రేమికులు పారిపోవడానికి ఎవరో ఒకరు స్నేహితులు సహకరిస్తూ ఉంటారు. పారిపోయిన ప్రేమికులు బాగానే ఉంటారు గానీ.. మధ్యలో సహకరించిన వారికే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో మధ్యలో ఉన్నవారు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. కులాల కట్టుబాట్లు, మతాల కుంపట్లు కొనసాగే మన దేశంలో ప్రేమ వివాహాలను కుటుంబ సభ్యులు అంత సులభంగా ఆమోదించరు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమికుల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించే వారిని ఏమాత్రం సహించరు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం ఓ యువతి, యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులో ఓ యువతి మాట్లాడుతోంది. ఆమె మాట్లాడిన మాటల ప్రకారం వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. వారి ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన మనసులో ఉన్న అంతరంగాన్ని బయటపెట్టింది. మొదట్లో ఆమె తన ప్రేమ గురించి చెప్పింది. ఆ తర్వాత ప్రకాష్ అనే వ్యక్తి గురించి బయట పెట్టింది.
“అమ్మానాన్న.. మా గురించి వెతకకండి.. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం సేఫ్ గానే ఉన్నాం. మేమిద్దరం ప్రేమించుకోవడానికి అనేక పరిస్థితులు దారి తీసాయి. మేము పారిపోవడానికి మాత్రం ప్రకాష్ అన్న ప్రధాన కారణమని” ఆ యువతి వ్యాఖ్యానించింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ప్రేమికుల ఇద్దరు బాగానే ఉన్నారని.. మధ్యలో సహాయం చేసిన ప్రకాష్ కే సినిమా చూపిస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయిపాయే
Prakesh anna నీ బ్రతుకు bus stand నే
— Geetha vijaya™ అఖండ² ✌️ (@geetha_happy2) December 14, 2025