Red Colour: ఎరుపు రంగు అనేది డేంజర్. ఈ రంగును చూడటానికి ఎంత బాగుంటుందో.. కానీ ఎద్దులు మాత్రం వీటిని చూసి పరిగెత్తుతాయి. సాధారణంగా ఇలాంటి సీన్స్ ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ రియల్‌గా కూడా ఎద్దులు ఎరుపు రంగును చూస్తే విధ్వంసం సృష్టిస్తాయి. ఎంత దూరంలో అయిన ఎరుపు రంగును ఎద్దులు చూస్తే హడలిపోతాయి. చుట్టూ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతుంది. రెడ్ కలర్ ఉన్న దుస్తులు ధరించిన వాళ్లని చూసి వారిపై దాడి చేస్తుంది. కొన్నిసార్లు వారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. నిజ జీవితంలో ఇలాంటివి పెద్దగా చూసి ఉండరు. కానీ సినిమాల్లో అయితే ఎక్కువగానే ఇలాంటి సీన్లు కనిపిస్తుంటాయి. మిగతా జంతువులు కంటే ఎద్దులు మాత్రం ఎరుపు రంగును చూస్తే పరిగెత్తుతాయి. వాటిని ధరించి ఉన్న మనుషులపై అయితే దాడికి కూడా పాల్పడతాయి. అయితే ఎద్దులకి ఎరుపు రంగు ఎందుకు పడదు? ఈ రంగు దుస్తులు లేదా దేన్ని చూసి అయిన కూడా ఎందుకు ఎద్దులు పరిగెత్తుతాయో మరి ఈ స్టోరీలో చూద్దాం.
మనుషులు, కోతులు మాత్రమే ఈ భూమి మీద ఉన్న అన్ని రంగులను చూస్తాయి. మిగతా ఎలాంటి జీవులు అన్ని రంగులను కూడా చూడలేవు. ఇందులో ఎద్దు కూడా అంతే. ఎద్దులు ఏ రంగును గుర్తించలేవు. ముఖ్యంగా ఎరుపు రంగును ఇవి అసలు చూడలేవు. ఎరుపు రంగు ఎద్దుల కళ్లకు కనిపించకపోవడంతో అవి పరిగెత్తుతాయి. చాలా మంది ఎద్దుకు ఎరుపు రంగు అంటే కోపం. అందుకే అవి కోపంతో రెచ్చిపోతాయని అనుకుంటారు. కానీ వాటికి ఎరుపు రంగు కనిపించక పోవడం వల్ల పరిగెత్తుతాయి. సాధారణంగా ఎద్దుల ముందు ఏ వస్తువుని అయిన ఉంచిన కూడా వాటికి కోపం వస్తుంది. ఈ క్రమంలోనే ఎరుపు రంగును చూడలేక అవి పరిగెత్తుతాయి. దీంతో మనం ఎరుపు రంగు అంటే వాటికి కోపమని అందుకే అవి మనపై దాడి చేస్తాయని అంటారు.
ఇలాంటి సీన్‌లు సాధారణంగా మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ యూరప్‌లోని స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో బుల్‌ఫైట్ అనేది బాగా నిర్వహిస్తారు. ఆ దేశాల్లో ఈ ఫైట్ చాలా పాపులర్. అంతే ప్రమాదకరమైనది కూడా. ఈ బుల్‌ఫైట్‌ను మటడోర్ అని అంటారు. ఎరుపు రంగు జెండాను ఎద్దుల ముందు ఉంచి అటూ ఇటూ ఊపి రెచ్చగొడతారు. దీంతో కోపంగా ఎద్దు వస్తుంటే దీన్ని నుంచి బుల్ ఫైటర్స్ తప్పించుకుంటారు. దీన్నే మటడోర్ అంటారు. ఆ దేశాల్లో ఈ బుల్‌ఫైట్‌ను ఎక్కువగా నిర్వహిస్తుంటారు. వీటిని చూడటానికి ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో ఉంటారు. భారీ సంఖ్యలో వీటిని చూడటానికి వెళ్తుంటారు. మన దేశంలో ఇలాంటివి పెద్దగా నిర్వహించరు. ఎందుకంటే వీటి వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుందని భావించి పెద్దగా ఆసక్తి చూపించరు.