Homeవింతలు-విశేషాలుMaharashtra Strange Tradition: రాక్షసుడిని పూజిస్తారు.. హనుమంతుడిని ద్వేషిస్తారు.. మనదేశంలో ఈ వింత ఆచారం ఎక్కడంటే..

Maharashtra Strange Tradition: రాక్షసుడిని పూజిస్తారు.. హనుమంతుడిని ద్వేషిస్తారు.. మనదేశంలో ఈ వింత ఆచారం ఎక్కడంటే..

Maharashtra Strange Tradition: మనదేశంలో ఆంజనేయ స్వామికి గుడి లేని ప్రాంతం అంటూ ఉండదు. ఆంజనేయస్వామి పేరులేని వ్యక్తి అంటూ ఉండడు. మనదేశంలో రాముడికి ఏ స్థాయిలో అయితే విశేషమైన పూజలు లభిస్తుంటాయో.. హనుమంతుడికి కూడా అదే స్థాయిలో పూజా క్రతువులు జరుగుతుంటాయి. ఆంజనేయస్వామిని చాలామంది తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. కొందరైతే తమ ఇళ్లల్లో కూడా చిన్న చిన్న ఆలయాలు నిర్మించుకొని.. అందులో ఆంజనేయస్వామిని ప్రతిష్టించి పూజలు జరుపుతుంటారు. ఇక మనదేశంలో హనుమాన్ జయంతి వేడుకలు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హనుమంతుడిని ఇష్ట దైవంగా పూజించే మనదేశంలో.. భిన్నమైన ఆచారం కొనసాగుతోంది. అక్కడ హనుమంతుడిని పూజించరు. మారుతి అనే పేరు కూడా పెట్టుకోరు. చివరికి మారుతి కంపెనీకి సంబంధించిన కార్లను కూడా కొనుగోలు చేయరు. ఆంజనేయులు అనే పదం వినిపిస్తే బూతు లాగా భావిస్తుంటారు. ఇదంతా కూడా మనదేశంలోని మహారాష్ట్ర లోనార్ లోని నందుర్ నింభా ధైత్య గ్రామంలో సాగుతున్న వింత ఆచారం. ఇక్కడ హనుమంతుడికి ఆలయాలు ఉండవు. పిల్లలకు మారుతి, ఆంజనేయులు అనే పేర్లు పెట్టరు. చివరికి మారుతి కంపెనీ కార్లు కూడా కొనుగోలు చేయరు. ఇక్కడ ప్రజలు నింభా దైత్యుడు అనే రాక్షసుడిని పూజిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహాలు పెడితే ఈ గ్రామానికి కీడు జరుగుతుందని వారు భావిస్తుంటారు. ప్రమాదాలు చోటు చేసుకుంటారని భయపడుతుంటారు. అందువల్లే ఆ ఊర్లో ఆంజనేయస్వామికి ఆలయం ఉండదు. ఆంజనేయ స్వామికి సంబంధించిన ప్రస్తావన కనిపించదు. అయితే వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికీ అక్కడి ప్రజలు దానిని కొనసాగిస్తున్నారు.

రాముడిని ఇలవేల్పుగా.. ఆంజనేయస్వామిని ధైర్యానికి ప్రతీకగా భావించే మనదేశంలో ఇలాంటి ఆచారం ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే ఆ రాక్షసుడు తమ గ్రామానికి కాపలా అని.. తమ గ్రామం ఈ స్థాయిలో సుఖ సౌఖ్యాలతో ఉంటోంది అంటే దానికి ఆ రాక్షసుడే కారణమని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ప్రతి ఏడాది ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. దసరా నుంచి మొదలు పెడితే దీపావళి వరకు ప్రతి పండుగలోనూ రాక్షసుడికి ఉత్సవాలు జరుపుతుంటారు..

నింభాదైత్యుడు అనే రాక్షసుడికి నైవేద్యాలు.. పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాల సమయంలో అన్నదానాలు కూడా జరుపుతుంటారు.. గ్రామస్తులు తమ ఇళ్లల్లో రాక్షసుడి చిత్రపటాలు ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకుంటారు. ఆ రాక్షసుడిని తమ పాలిట దైవంగా చెప్పుకుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular