Pakistan Parachute: చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ పని విజయవంతమవుతుంది. అలాకాకుండా గాలికి దీపం పెట్టి.. దేవుడా నీదే భారం అంటే.. అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. అందుకే చేసే పని గొప్పగా ఉండాలి. అందులో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన ఆవిష్కరణలు.. ఇకపై వచ్చే ఆవిష్కరణలు సానుకూల ఫలితాన్ని ఆశించి చేసినవే. చేసేవే కూడా. కానీ కొందరు చేసే ప్రయోగాలు పరమ దరిద్రంగా ఉంటాయి.. వాటిని చూస్తే వీళ్ళు మనుషులేనా? అనే అనుమానం కలుగుతుంది.
సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన భుజాలకు ఒక పల్చటి రెక్కల లాంటి వస్తువులను కట్టుకున్నాడు. ఓ కొండ ప్రాంతానికి ఎక్కాడు. ఎలా అయితే ఎక్కాడో.. అలాగే కిందికి దిగడానికి ప్రయత్నించాడు. దిగేందుకు అతను చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. పైగా తన భుజాలకు ఉన్న రెక్కల లాంటి వస్తువులు గాలిలో తేలే విధంగా చేస్తాయని అనుకున్నాడు. చివరికి గాయాల పాలయ్యాడు. వాస్తవానికి ఇలాంటి ప్రయోగాన్ని స్కూలుకు వెళ్లే పిల్లాడు కూడా చేయడు. కానీ అతడు ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? అనే ప్రశ్నలే నెటిజన్ల మదిని తొలిచేస్తున్నాయి.
ఆ వ్యక్తి పాకిస్తాన్ దేశానికి చెందినవాడు. పాకిస్తాన్లోని కొండ ప్రాంతంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన అతడు ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే పారాచూట్ ను తయారు చేయాలనుకున్నాడు. అలాగే చేశాడు కూడా.. కాకపోతే అతడి పనిలో నాణ్యత లేదు. అతడి ఆలోచన గొప్పగా ఉన్నప్పటికీ ప్రయోగం అంత దరిద్రంగా ఉంది. దీంతో ఆ ప్రయోగం వికటించి, అతడిని గాయాలపాలు చేసింది. వాస్తవానికి ఆ పారాచూట్ తయారీ విషయంలో అతడు జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఏదో కావాలి అనుకున్నాడు. చివరికి గాయాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.