Viral income story: నేటి కాలంలో ఐటీ పరిశ్రమలో పనిచేసే వారికి భారీగా వేతనాలు ఉన్నాయి. ఫార్మా రంగంలో పనిచేసే వారికి కూడా భారీగానే వేతనాలు లభిస్తున్నాయి. ఈ రంగాలలో ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ.. వేతనాల పెంపు విషయంలో మాత్రం కంపెనీలు ఏమాత్రం తగ్గడం లేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానాలు ఐటీ పరిశ్రమ గతిని పూర్తిగా మార్చేస్తున్నప్పటికీ.. ఉద్యోగాలలో కోత విధిస్తున్నప్పటికీ.. చాలామందికి ఈ రంగాలలో భారీగా వేతనాలు లభిస్తూనే ఉన్నాయి. ఐటీ పరిశ్రమ కుదుపులకు గురవుతున్నప్పటికీ.. చాలామంది ఇందులోనే పనిచేయాలని భావిస్తున్నారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా చదువులు చదువుతున్నారు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక పోస్ట్ ప్రకారం ఒక వ్యక్తి నెలకు రెండు లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. అలాగని అతడేమి గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదు. పేరుపొందిన కంపెనీలలో పనిచేయడం లేదు. రియల్ ఎస్టేట్ కంపెనీని నిర్వహించడం లేదు. అతడి కేవలం ఒక సామాన్యమైన ఇస్త్రి షాపు ఏర్పాటు చేసుకున్నాడు..
ఇస్త్రీ షాప్ ద్వారా ప్రతిరోజు అతడు వందల దుస్తులను ఇస్త్రీ చేస్తాడు. అదే సమయంలో డ్రై క్లీనింగ్ కూడా చేస్తాడు. తద్వారా నెలకు రెండు లక్షలకు పైగా సంపాదిస్తాడు. అతడికి భార్య కూడా సహకరిస్తుంది. బొగ్గు.. ఇతర ఖర్చులు పోను ప్రతినెలకు 2.37 లక్షలు సంపాదిస్తున్నట్టు ఆ దంపతులు చెప్పారు. ఈ సంపాదన ఒక ఐటీ ఉద్యోగి జీతంతో సమానమని తెలుస్తోంది. ఏ వృత్తి అయినా సరే అంకిత భావంతో చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ దంపతులు నిరూపిస్తున్నారు.
ఈ దంపతులు సంపాదిస్తున్న సంపాదన చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది కులవృత్తులను హీనంగా చూస్తారని.. కానీ ఇతడు మాత్రం దానిని గౌరవంగా భావిస్తున్నాడు. అందువల్లే తన భార్యతో కలిసి తీవ్రంగా శ్రమిస్తూ.. ప్రతినెల 2 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. ఒకరి వద్ద పనిచేయకుండా.. ఉద్యోగం ఉంటుందో? ఉండదో? అనే భయాలు లేకుండా.. డబ్బు సంపాదిస్తున్నాడు. పైగా ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇతడు సంపాదిస్తున్న సంపాదనను వివరిస్తూ ఓ మహిళ ట్వీట్ చేయడంతో.. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.