First Night Moment: నేటి కాలంలో ప్రజల అభిరుచులు మారిపోతున్నాయి. అలవాట్లు కూడా విచిత్రంగా ఉంటున్నాయి. రోత అనుకున్నది ఇప్పుడు గొప్పగా అనిపిస్తోంది. గొప్పగా అనుకున్నది రోతగా మారిపోయింది. ట్రెండు అంటూ.. ట్రెడిషన్ కు పాతర వేస్తున్నారు. కొత్తదనం అనుకుంటూ సాంప్రదాయాలకు చరమగీతం పాడుతున్నారు. ఇది ఎక్కడదాకా వెళ్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే పరిస్థితి బాగోలేదు.. బాగుపడుతుందనుకొనే నమ్మకం లేదు.
సోషల్ మీడియాలో ఒక వీడియో సర్కులేట్ అవుతుంది. ఆ వీడియోలో చూస్తున్న దృశ్యాల ప్రకారం అది ఒక గృహంలాగా కనిపిస్తోంది.. అందులో ఓ జంటకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత వివిధ కార్యక్రమాలను బంధుమిత్రులు నిర్వహించారు. చివరికి భార్యాభర్తలను ఏకం చేసే కార్యానికి రూపకల్పన చేశారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియనే. పైగా దీనిని మనదేశంలో గౌరవప్రదమైన వేడుకగా భావిస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే భార్యాభర్తలను ఏకం చేసే కార్యక్రమాన్ని గొప్ప వేడుకగా జరుపుతుంటారు. బంధువులకు రకరకాల మాంసాహార వంటకాలతో విందు ఇస్తుంటారు. అయితే నేటి యువత మాత్రం ఆ వేడుకను మరో విధంగా జరుపుకుంటున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా వీడియో తీస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఓ జంట తమ కార్యక్రమానికి సంబంధించి దృశ్యాలను వీడియోలో బంధించారు. బంధుమిత్రులు కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తుండగా గదిలోకి వెళ్లారు. పైగా ఆ పెళ్లికూతురు ఏ మాత్రం సిగ్గుపడకుండా.. వీడియోకు ఫోజు ఇచ్చింది. పెళ్లి కుమారుడు కాస్త సిగ్గుపడ్డాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన సర్కులేషన్ లో ఉంది.
ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్నట్టు అక్కడ దృశ్యాలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఆ నూతన జంట ఉద్యోగస్తులని.. ఐటీ కంపెనీలో పని చేస్తున్నారని తెలుస్తోంది. కొత్తదనం కోసం వారిద్దరు ఇలా చేశారని.. ఈ దెబ్బతో వారిద్దరూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కావాలని భావించారని కామెంట్ల ద్వారా తెలుస్తోంది. అయితే చాలామంది వారు చేసిన పనిని విమర్శించడం విశేషం. నాలుగు గోడల మధ్య జరిగిన కార్యక్రమాన్ని.. నాలుగు దిక్కుల మధ్య చేసుకోవడమే బాధాకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.