Mysterious Village In Telangana : ఈ విశ్వంలో అనేక రహస్యాలు, వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. వాటిని చూసినప్పుడే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి ఆశ్చర్యకరమైనది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో కూడా జరుగుతుంది. జిల్లాలోని కొదురుపాక గ్రామంలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఇదే ఆ గ్రామం ప్రత్యేకత.
సుల్తానాబాద్ మండలం..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ప్రజలు ఉదయం 8 గంటల తర్వాత ఇంట్లో అన్ని పనులు పూర్తిచేసుకుని హడావుడిగా బయటకు వెళ్లారు. సాయంత్రం 4 గంటల వరకూ పొలం పనులు ముగించుకుని తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. సాధారణంగా వ్యవసాయం పనులను సాయంత్ర 5 నంచి 6 గంటల వరకూ చేస్తారు. కొదురుపాక రైతులు, కూలీలు మాత్రం 4 గంటలకే పూర్తి చేస్తారు.
సాయంత్రం మిస్..
సాధారణంగా ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి.. ఇలా నాలుగు జాముల గురించి తెలుసు. కొదరురుపాక గ్రామంలో సాయంత్రం ఉండదు. 4 గంటలకే చీకటి పడుతుంది. భౌగోలిక పరిస్థితులే ఇందుకు కారణం.
ఆలస్యంగా సూర్యోదయం..
కొదురుపాక గ్రామంలో సూర్యోదయం కూడా ఆలసయంగా జరుగుతుంది. ఇక్కడ పగలు తక్కువ, రాత్రి ఎక్కుగా ఉంటుంది. ఈ కారణంగా గ్రామస్తుల లైఫ్‌స్టైల కూడా భిన్నంగా ఉంటుంది. అంతటా సూర్యోదయం 6 నంచి 6:30 గంటల మధ్య జరిగితే.. కొదురుపాకలో మాత్రం ఉదయం 8 గంటలకు సూర్యోదయం అవుతుంది. పగలు తక్కువగా ఉంటుంది. సూర్యాస్త మయం కూడా తొందరగా జరుగుతుంది. అందుకే పనులు హడావుడిగా చేసుకుని ముగించుకుని 4 గంటల వరకు ఇళ్లకు చేరుకుంటారు.
ఎందుకిలా అంటే…
గ్రామ భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొదురుపాక గ్రామం చుట్టూ 4 గుట్టలు ఉంటాయి. గ్రామానికి తూర్పున గొల్లగుట్ట.. పడమర రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబూలాద్రి గుట్ట, దక్షిణాన పాముబండ గుట్ట అనేవి ఉన్నాయి. తూర్పున ఉన్న గొల్లకుట్ట కారణంగా సూర్యుడు ఆలస్యంగా వస్తాడు. ఉదయం 8 గంటల వరకు చీకటే ఉంటుంది. ఇక పడమరన రంగనాయకుల గుట్ట ఉండడంతో సూర్యాస్తమయం సాయంత్రం 4 గంటలకే జరుగుతుంది. దీంతో చీకటిపడుతుంది. ఇళ్లలో లైట్లు ఆన్ చేస్తారు.
చారిత్రక నేపథ్యం..
కొదురుపాక గ్రామానికి చారిత్రక నేపథ్యం ఉంది. శాతవాహన, జైనుల కాలంలో నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి భక్తులు, టూరిస్టులు వస్తుందటారు. కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ వెళ్లి.. అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొదురుపాకకు వెళ్లాలి.