Meta AI Smart Glasses Controversy: సాంకేతిక పరిజ్ఞానం అనేది మనిషి జీవితానికి సుఖాన్ని కలిగించాలి. అదనపు ప్రయోజనాన్ని అందించాలి. ఇప్పటివరకు ఈ ప్రపంచ పురోగతికి శాస్త్ర సాంకేతిక రంగాలు దోహదపడ్డాయి. అయితే ఇటీవల కాలంలో వస్తున్న టెక్నాలజీ మనిషి జీవితాన్ని సమూలంగా మార్చడమే కాదు.. కొన్ని కొన్ని విషయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అది మనిషి జీవితంలో మార్పులకు కారణమవుతోంది.
Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?
ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా కంపెనీ రూపొందించిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ గ్లాసెస్ వివాదాలను ఎదుర్కొంటున్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వినియోగదారుల అత్యంత వ్యక్తిగత దృశ్యాలను రికార్డు చేసి.. బయటికి పంపిస్తున్నట్టు తెలింది. ముఖ్యంగా నగ్న, పడకగది, బాత్రూం దృశ్యాలను.. బ్యాంకు కార్డుల వివరాలు రికార్డు చేస్తున్నట్టు సమాచారం.. అంతేకాదు ఈ దృశ్యాలను రికార్డ్ చేసి కెన్యాలోని రివ్యూయర్లకు పంపిస్తున్నట్టు స్వీడన్ దేశానికి చెందిన పత్రికల ఇన్వెస్టిగేషన్లో తేలింది.
ఈ వీడియోలను బ్లర్ చేసే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో.. అందులో ఉన్న వ్యక్తులమ్మకాలు అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మెటా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ గ్లాసెస్ పై క్లాస్ యాక్షన్ దావా నమోదు అయినట్టు తెలుస్తోంది. మెటా కంపెనీ గూగుల్, ఇతర సంస్థలకు పోటీగా స్మార్ట్ గ్లాసెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులకు అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని భావించింది. స్మార్ట్ గ్లాస్ తయారీలో నెంబర్ వన్ గా ఎదగాలని అనుకుంది. కానీ వాస్తవం మాత్రం మరో విధంగా ఉంది. ఎందుకంటే మెటా రూపొందించిన స్మార్ట్ గ్లాసెస్లో కొన్ని సదుపాయాలను ఉపయోగించి అక్రమార్కులు ఈ విధమైన దారుణాలకు పాల్పడుతున్నారు.
కెన్యాలోని రివ్యూయర్లు ఈ వీడియోలను వేరే ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దల చిత్రాలను ప్రదర్శించే వెబ్సైట్లకు ఈ వీడియోలను అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ వెబ్ సైట్ల ద్వారా భారీగా వెనకేసుకుంటున్నట్టు సమాచారం. ఒక ఉత్పత్తి ఎలా ఉంటుంది? అది ఎలా పని చేస్తుంది? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మనిషి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? అనే అంశాల ఆధారంగా రివ్యూయర్లు విశ్లేషణ చేస్తారు. కానీ, కెన్యాలోని రివ్యూయర్లు ఆ వీడియోలను తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మెటా కళ్లద్దాలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తాయి. ఇవి స్మార్ట్ గ్లాసులలో సరికొత్త అనుభవాన్ని యూజర్లకు అందిస్తాయి. అయితే వీటిని ఉపయోగించి కొంతమంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.
