https://oktelugu.com/

Ichigo Ichi : గతం ఇబ్బంది పెడుతోందా.. వర్తమానం నరకం చూపిస్తోందా.. భవిష్యత్తు భయం వెంటాడుతోందా.. ఇదిగోండి ఈ సూత్రం మీకు ఆనంద మార్గమవుతుంది..

జపాన్ దేశంలో మార్షల్ ఆర్ట్స్ అనేవి కామన్. అందులో ఇచిగో ఇచి గురించి అత్యంత లోతైన విశ్లేషణ ఉంటుంది. "యుద్ధం అనేది ఎలాగైనా ఉండొచ్చు. అది శారీరకమా, మానసికమా అనేది పక్కన పెడితే.. యుద్ధంలో ఆ క్షణమే కీలకంగా ఉంటుంది. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు స్పందించడానికి ఉండదు. ఒకవేళ తర్వాత స్పందించాలి

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 18, 2024 / 12:53 PM IST

    Ichigo Ichi

    Follow us on

    Ichigo Ichi : జీవితం అనేక అనుభూతులమయం. ఇందులో గతం ఉంటుంది. వర్తమానం ఉంటుంది. భవిష్యత్తు కూడా ఉంటుంది. గతం మనకు ఒక జ్ఞాపకం అయితే, వర్తమానం ఒక నిర్దేశం, భవిష్యత్తు ఒక మార్గదర్శకం.. అయితే అందరికీ ఇవన్నీ ఒకేలా ఉండవు. కొందర్ని గతం భయపెడుతుంది. ఇంకా కొందర్ని భవిష్యత్తు వేధిస్తుంది. ఇంకా కొందరికి వర్తమానం నరకం చూపిస్తుంది. అందువల్లే చాలామంది వీటన్నింటిని తలుచుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు. అందువల్లే ఈ క్షణం విలువ తెలుసుకోలేక వేదన చెందుతుంటారు. ప్రస్తుత కాలాన్ని ఆస్వాదించలేక.. ఏ చిన్న అనుభూతిని పొందలేక.. ఇంతకంటే మంచి రోజులు వస్తాయని భ్రమలో బతికేస్తుంటారు. అయితే ఇలా బతకడం సరికాదని చెబుతోంది జపనీస్ జీవితమంత్రం ఇచిగో ఇచి.

    జపాన్ లోని ఓ మామూలు గ్రామంలో సోజీ అనే వ్యక్తి జీవిస్తుంటాడు. అతడు గొప్ప చాయ్ మాస్టర్. 1588 కాలంలో అతడు ఒక డైరీ రాసుకున్నాడు. ఆ డైరీలో ఇచిగో ఇచి ప్రస్తావన ఉంది. జపాన్ దేశస్తులు టీ వేడుకలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అందులో మనస్ఫూర్తిగా పాల్గొంటారు ఆ సమయాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తారు. ఆ అనుభూతులకు అక్షర రూపం ఇస్తున్నప్పుడే సోజీ ఇచిగో ఇచి గురించి వివరించాడు. ఆ తర్వాత అది జపాన్ దేశంలో ఒక ఆనంద సిద్ధాంతంగా రూపాంతరం చెందింది.

    జపాన్ దేశంలో మార్షల్ ఆర్ట్స్ అనేవి కామన్. అందులో ఇచిగో ఇచి గురించి అత్యంత లోతైన విశ్లేషణ ఉంటుంది. “యుద్ధం అనేది ఎలాగైనా ఉండొచ్చు. అది శారీరకమా, మానసికమా అనేది పక్కన పెడితే.. యుద్ధంలో ఆ క్షణమే కీలకంగా ఉంటుంది. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు స్పందించడానికి ఉండదు. ఒకవేళ తర్వాత స్పందించాలి అనుకుంటే మరుసటి క్షణంలో మనం జీవించి ఉండకపోవచ్చు” అని సోజీ ఇచిగో ఇచి లో ప్రస్తావించాడు. జపాన్ లోని ఇచిగో ఇచి ఆనంద మాత్రమే హాలీవుడ్ లోని ఫారెస్ట్ గంప్ సినిమాకు నేపథ్యం. అంతేకాదు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో జపాన్ లో పర్యటించినప్పుడు ఇచిగో ఇచి గురించి ప్రస్తావించారు.

    ఇచిగో ఇచి మాట అంటే జపాన్ దేశస్థులకు ప్రాణంతో సమానం. ఈ పేరుతో ఆ దేశంలో అనేక కంపెనీలు వెలిశాయి. “మాట్లాడుతూ, నడుస్తూ, పనిచేస్తూ, టీ తాగుతూ, భోజనం చేస్తూ ధ్యానం చేయడమే” ఇచిగో ఇచి అంటే ఇవే అని జపాన్ దేశస్తులు సగర్భంగా చెప్పుకుంటారు. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభమైనప్పుడు వనభోజనాలకు వెళ్తారు. మరికొందరు శ్రావణమాసంలో వెళ్తుంటారు. ఇంకా కొందరు కార్తీక మాసంలో వెళ్తుంటారు. జపాన్ దేశంలో మాత్రం చెర్రీ చెట్లు మొక్కలు తరుగుతున్నప్పుడు ఒకసారి.. అవి పూలు పూస్తున్నప్పుడు ఒకసారి.. పూలు రాలుతున్నప్పుడు మరొకసారి.. ఇరాక్ ప్రతి సందర్భాన్ని వారు వేడుకగా జరుపుకుంటారు. అయితే ఇవి కేవలం సాకులు మాత్రమే.. అసలు అంతరార్థం మాత్రం అన్ని కాలాల్లో ఆనందాన్ని వెతుక్కోవడమే వారి ప్రయత్నం.