spot_img
Homeవార్త విశ్లేషణMan Survived Death Six Times Real Story: ఆరుసార్లు చనిపోయి బతికాడు.. చిరంజీవి అంటే...

Man Survived Death Six Times Real Story: ఆరుసార్లు చనిపోయి బతికాడు.. చిరంజీవి అంటే ఇతడే కాబోలు..

Man Survived Death Six Times Real Story: మనం ఎవరైనా పెద్దవాళ్లు కలిస్తే కాళ్లకు నమస్కరిస్తాం. దానికి వారు నూరేళ్లు చల్లగా బతుకు అంటూ దీవిస్తారు. అలా దీవించడం వెనక కారణం ఉంది. ఒక మనిషి సంతృప్తిగా బతికినప్పుడే అతడి జీవితం సార్థకమైనట్టు. ఎన్ని కష్టాలైనా పడనీయండి.. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొనివ్వండి.. జీవితాన్ని సాఫీగా లాగించినప్పుడే ఆ బతుకుకు ఒక అర్థం. అందువల్లే పెద్దవాళ్లు దీర్ఘాయుష్మాన్ భవ అనే దీవిస్తుంటారు. కానీ మీరు చదవబోయే ఈ కథనంలో.. ఇతడిని ఎంతోమంది పెద్దవాళ్లు అలా దీవించి ఉంటారు. అందువల్లే చిరంజీవిగా నిలిచాడు..

మనలో ఎవరికైనా ప్రమాదం జరిగి.. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని…అనేక రకాలైన కష్టాలు పడి బతికితే.. చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చాడు అంటారు. అలా ఒక్కసారి జరిగితేనే చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది ఇతని జీవితంలో ఆరుసార్లు అలానే జరిగింది. ఆరుసార్లు కూడా చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చాడు. కొన్ని సందర్భాలలో అతడికి అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఎక్కడో అతడికి ఆయుషు గట్టిగా ఉంది. అందువల్లే మళ్లీ జన్మించాడు. ఒకరకంగా ఆరుసార్లు అతడు పునర్జన్మలను పొందాడు. అందువల్లే అతడిని చిరంజీవి అని పిలుస్తున్నారు.

ఆ వ్యక్తి పేరు ఇస్మాయిల్. ఉండేది ఆఫ్రికాలోని టాంజానియా ప్రాంతంలో. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. టాంజానియా ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఇస్మాయిల్ ఉంటాడు. తన కుటుంబ సభ్యులు కూడా అతనితోనే ఉంటారు. అయితే ఇస్మాయిల్ 6 సార్లు మృత్యువును జయించాడు. అతడి మొండి ధైర్యం అనేకసార్లు చావును తప్పించింది. వైద్యులు కూడా అతడు మరణించాడని ధ్రువీకరించిన అనంతరం.. అనూహ్యంగా అతడు ప్రాణాలతో తిరిగి రావడం విశేషం. గుండె స్పందన ఆగిపోవడం.. తీవ్రమైన ప్రమాదాలకు గురై చనిపోయాడని నిర్ధారించడం.. అంత్యక్రియలు చేసే ముందు కండ్లు తెరిచిన సందర్భాలు ఇస్మాయిల్ జీవితంలో ఉన్నాయి. దీంతో అతడు అలా చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చి మళ్ళీ బతకడంతో.. సొంతవారు సైతం ఆశ్చర్యపోయేవారు. దుష్టశక్తి అతడిని ఆవహించిందని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు.

ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అతడు తన జీవితం మీద ఆశ కోల్పోలేదు. తనను చావు చివరి అంచదాక తీసుకువెళ్లిన భగవంతుడు.. మళ్లీ బతికించాడని.. అంటే తాను ఈ భూమి మీద చేయాల్సిన పని ఇంకా ఏదో ఉందని.. అందువల్లే తాను ఇంకా జీవించి ఉన్నానని ఇస్మాయిల్ చెబుతున్నాడు. అనేక ఇబ్బందులను ఎదుర్కొని బతికి బతకడితే.. సొంత కుటుంబ సభ్యులు తనను ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయడం బాధ కలిగించిందని ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడైతే ఇంట్లోకి రానిస్తున్నారని.. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి తాను ఇబ్బంది పడితే మాత్రం.. కుటుంబ సభ్యులే తనను చంపేస్తారని ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అలాంటి దుర్మార్గానికి పాల్పడబోమని.. అప్పట్లో ఇస్మాయిల్ ప్రవర్తన విచిత్రంగా ఉండడంవల్లే తాము ఇంట్లో నుంచి బయటికి గెంటేశామని వారు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version