Dhumalwadi: వ్యవసాయం అంటే ఎప్పుడూ చిన్న చూపే. భూమిని దున్ని బువ్వను పండించే రైతులపై అందరూ వివక్ష చూపుతున్నారు. రైతుకు పిల్లను ఇవ్వడానికి కూడా వెనుకాడే నేటి పరిస్థితి. కర్ణాటకలో తమకు పిల్లను ఇవ్వడం లేదని ఓ గ్రామ రైతుల ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ ఈ పరిస్థితిలో మహారాష్ట్రలోని ఓ గ్రామ రైతులకు పిల్లను ఇవ్వడానికి పోలీ పడుతున్నారు. ఒకప్పుడు దుర్భిక్షం రాజ్యమేలిన ఆగ్రామం ఇప్పుడు ఏటా రూ.50 కోట్లు సంపాదిస్తోంది. యువ రైతుల కృషి ఫలితంగా ఆ ఊరు ఇప్పుడు పండ్ల గ్రామంగా ప్రసిద్ధి చెందింది మహారాష్ట్రలోని ధమల్‌వాడీ. లక్షాధికారుల పల్లె అని కూడా ఆ ఊరిని పిలుస్తారు. కూలీ చేసుకునే పరిస్థితి నుంచి. ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన ధమల్‌వాడీ గ్రామస్తుల గురించి తెలుసుకుందాం.
కరువును ఎదురించి..
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ధుమల్‌వాడీ. జాలువారే జపాతాలు. పచ్చని కొండలు, కోనలు.. చుట్టూ పరుచుక్ను అందం.. గ్రామంలోని ఇళ్లకు, కొండలకు మధ్య పరుచుకున్న పొలాల్లో సీజన్‌కో రకం పండ్లు సాగవుతున్నాయి. ప్రతీ రైతు ఇంటిముందు రాశులు పోసి ఉంటాయి. భౌగోళిక పిరిస్థితులు, పచ్చదనం వలన ఒకప్పుడు దుర్భిక్షం ఎదుర్కొన్న ఆ ప్రాంతం ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా మారింది. రైతులు తెల్చిన పండ్ల విప్లవంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
నాడు కూలీలుగా…
ఒకప్పుడు ధుమల్‌వాడీ గ్రామంలో పంటలు పండేవి కావు. రైతులంతా కూలీలుగా పనిచేసే పరిస్థితి. ఇతర గ్రామాలకు పనికోసం వెళ్లేవారు. కానీ ఇపుపడు పరిస్థితి మారింది. ఆ గ్రామానికి చుట్టూ ఇరవై గ్రామాల నుంచి కూలీలు పనుల కోసం ధుమల్‌వాడీకి వస్తున్నారు. 250 కుటుంబాలు ఉన్న ధుమల్‌వాడీలో కొన్నేళ్ల క్రితం వరకు మినుములు, గోధుమలు, జొన్నలు మాత్రమే సాగు చేసేవారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నా.. భూసారం లేకపోవడం, చీడపీడల కారణంగా పంటలు పండేవి కావు. పండిన పంటలకూ గిట్టుబాటు మద్దతు ధర దక్కక రైతులు నష్టపోయేవారు.
సొంతూరిపై మమకారంతో..
పంటలు పండని పరిస్థితి, కూలీలు వలస పోతున్న నేపథ్యంలో సొంత ఊరిపై మమకారంతో గ్రామ పెద్దలు ఆ పరిస్థితిలో మారుప తేవాలనుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించారు. భూసారం పెంచుకునే మార్గాలు అన్వేషించారు. పండ్ల తోటలకి తమ వాతావరణం అనుకూలమని శాస్త్రవేత్తలు చెప్పిన విషయాన్ని గుర్తించారు.
ఏకతాటిపైకి వచ్చి…
ఊరు బాగుపడే విషయం తెలిసినా.. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం కష్టంగా మారింది. అనేక ఇబ్బందుల తర్వాత పండ్ల తోటలు వస్తే తమ ఊరు బాగుపడుతుందని అందరూ గుర్తించారు. అయితే పెట్టుబడి భారీగా పెట్టాల్సి రావడంతో చాలా మంది వెనుకాడారు. కొంతమంది పండ్ల తోటలు సాగు ప్రారంభించారు. తర్వాత ఒకరిని చూసి ఒకరు అందరూ పండ్ల తోటల సాగుకు ముందుకు వచ్చారు. ఒక రకం పండ్ల తోటలు సాగుచేస్తే ఒకే సీజన్‌కు పరిమితం కావాల్సి వస్తుందని గుర్తించారు. వేర్వేరు పండ్ల తోటల సాగుకు ముందుకు వచ్చారు.
పండ్ల తోటలు ఇలా..
గ్రామంలో దానిమ్మ, మామిడి, సపోటా, కొబ్బరి, సీతాఫలం, అరటి, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బొప్పాయి, జామ, ఉసిరి, ద్రాక్ష, నారింజ, పనస తదితర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. ప్రతీ సీజన్‌లో ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాదిలో రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు టర్నోవర్ సాధిస్తోంది ధుమల్‌వాడీ గ్రామం.
పొలం లేకున్నా సాగు..
ఇక ధుమల్‌వాడీలో పండ్ల తోటల మధ్య పశువుల మేత, ఇంటి అవసరాలకు కూరగాయలు పండిస్తున్నారు. తమ పంటను మార్కట్‌కు తరలించాల్సిన పని లేదు. ఊళ్లోనే విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు ఊరికి వచ్చి మరీ కూరగాయలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇక ఇక్కడ పండుతున్న పండ్లను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిలీ, గుజరాత్ రాష్ట్రాలకు చందిన వ్యాపారువు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గ్రామంలో పొలం లేనివారు కూడా కాలువలు, చెరువు గట్లపై పండ్ల తోటలు సాగుచేస్తున్నారు. యాపిల్, చిలీ, మల్బరీ, స్టార్ ఫ్రూట్, వాటర్ ఆపిల్ వంటివి సాగుచేసి ఆదాయం పొందుతున్నారు. దీనికి అక్కడి రైతులు కూడా సహకారం అందిస్తున్నారు. జల వనరులు లేకున్నా బిందు సేద్యం చేస్తున్నారు.
పిల్లను ఇవ్వడానికి పోటీ…
ఇక ధుమాల్‌వాడీ రైతుల ఏటా లక్షల రూపాయల ఆదాయం పొందుతుండడంతో ఈ గ్రామానికి పిల్లను ఇవ్వడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. తమ పిల్లను చేసుకోవాలని బతిమాలుతున్నారు. రైతులకు పిల్లను ఇవ్వడానికి వెనుకాడే వారు కూడా ధుమాల్‌వాడీకి పిల్లను ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు అయితే పోటీ పడుతున్నారు.