https://oktelugu.com/

Chandanki Village: ఆ ఊరిలో పొయ్యి కూడా వెలగదు. మరి ఏం తింటారు? ఎలా?

మనిషి జీవించాలంటే ఆహారం అవసరం. అయితే బిజీ వల్ల చాలా మంది ఇంట్లో వండిన ఆహారం కంటే ఎక్కువ బయట ఫుడ్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ డాక్టర్లు మాత్రం ఇంట్లో ఆహారాన్ని మాత్రమే తినాలి అంటున్నారు. కానీ ఓ గ్రామం మొత్తం ఇంట్లో వంట చేయదు. ఈ గ్రామం ఇతర దేశంలో కాదు మ‌న దేశంలోనే గుజ‌రాత్ లో ఉంది. మరి ఇక్కడ ఎందుకు వంట చేయరు. వారు ఎక్కడ భోజనం చేస్తారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 26, 2024 / 10:26 AM IST

    Chandanki Village

    Follow us on

    Chandanki Village: గుజరాత్‌లోని చందన్‌కీ అనే గ్రామం గురించి కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ గ్రామం ట్రెండింగ్ లో ఉంటుంది. దీని వెనుక అస‌లు కార‌ణం ఏంటి అనుకుంటున్నారా? ఈ గ్రామంలో పొయ్యి పొయ్యి వెల‌గ‌దు. వంట అసలు చేయరు. ఈ ప్ర‌త్యేక చందన్‌కీ గుజ‌రాత్ లోని మహేసనా జిల్లా బెచరాజీ తాలూకాలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చందన్‌కీ గుజరాత్‌లోని ఒక చిన్న గ్రామం అని తెలిసింది. ఇక్క‌డ జనాభా దాదాపు 250 మంది ఉంటారు. అందులో 117 మంది పురుషులు, 133 మంది స్త్రీలు ఉంటారు. ఈ జ‌నాభా వేయి వ‌ర‌కు చేరింద‌ట. ప్ర‌స్తుత జ‌నాభా గ‌ణాంకాలు గ‌మ‌నిస్తే గ్రామంలో 500 మంది పౌరులు ఉంటున్నారు. మిగ‌తా వారు వేరే ప్రాంతాల్లో ప‌నిచేస్తున్నారు. ఈ ఊరిలో ఎక్కువగా సీనియర్ సిటిజన్లే ఉంటారు.

    ఈ ఊరిలో ఎవరు కూడా వంట చేయరు. వీరి ఆహారం కోసం ఇక్కడి ప్రజలందరికీ కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఇందులో రోజుకు రెండుసార్లు భోజనం వడ్డిస్తారు. ఇక వీరందరూ కలిసి అక్కడే భోజనం చేస్తుంటారు. ఈ ఆహారం కోసం ఒక్కొక్కరికి నెల‌కు 2000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇక్కడ సాంప్రదాయ గుజరాతీ ఆహారం ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధ తో రుచి, నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ అవరు.

    చందన్‌కీ గ్రామ సర్పంచ్ పూనంబహాయి పటేల్ దీన్ని ప్రారంభించారు. 20 సంవత్సరాలు న్యూయార్క్‌లో పనిచేసిన పటేల్ తన స్వగ్రామానికి తర్వాత వచ్చారట. ఈ క్ర‌మంలోనే త‌న ఊర్లోని ప‌రిస్థితులు గ‌మ‌నించగా.. ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారని తెలిసింది. యువత ఉద్యోగాల కోసం పట్టణాలకు వెల్లడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక మిగిలిన వృద్ధులు ఇతర పనుల కోసం ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు డబ్బులు పంపించినా వారి అవసరాలు తీర్చే వారు లేరట.

    కుటుంబ వ్యవస్థలో మార్పుల‌తో చాలా మంది వృద్ధులు గ్రామంలో ఒంటరిగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పూనాంబాయి పటేల్ చందన్‌కీ ఊరిలో అందరు ఒకే కుటుంబం మాదిరి కలిసి ఉండాలి అనుకున్నారు. అందుకే ఇలా గ్రామంలో కమ్యూనిటీ భోజ‌న‌ హాల్‌ను ప్రారంభించారు. ఇక్క‌డ‌ కలిసి భోజనం చేస్తార. ఒక్కొక్క‌రుగా ఇందులో చేరుతూ క్రమంగా ఊరు మొత్తం చేరిపోయింది.

    చందన్‌కీ గ్రామంలోని ఏ ఇంట్లో అయినా సరే ఆహారం వండరు. కమ్యూనిటీ హాల్‌లో నే అంద‌రూ క‌లిసి తింటారు. తమ పిల్లలు, కుటుంబ సభ్యులు తమ వద్ద లేకపోయినా ఆ ఊరంతా కుటుంబం మాదిరి ఉంటారు. చందన్‌కీ గ్రామంలోని ఈ సంప్రదాయాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. చాలా డిఫరెంట్ ఆలోచన కానీ బాగుంది కదా..