Indian Railways: భారతదేశంలో రైల్వే వ్యవస్థ అత్యంత పొడవైన రవాణా మార్గం. ప్రతిరోజూ రైళ్లలో 24 మిలియన్ల మంది ప్రయాణికులు రవాణా చేస్తారని ఓ అంచనా. కొందరు దూర ప్రయాణాల కోసం రైళ్లలో వెళ్తుంటే.. మరికొందరు ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ప్రతిరోజూ ట్రైన్ జర్నీ చేస్తుంటారు. అయితే రైలులో ప్రయాణం చేసేవారు రైల్వే బోర్డుకు సంబంధించిన కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. రైలు ప్రయాణం సాఫీగా సాగాలంటే ముందే వీటిపై అవగాహన పెంచుకోవాలి. అయితే రైలు ప్రయాణంలో స్టేషన్లలో కొన్ని బోర్డులు ఉంటాయి. అవి ఆ ప్రదేశాన్ని సూచిస్తాయి. అయితే కొన్ని బోర్డులపై వివిధ పేర్లు ఉంటాయి. వీటిలో central, Terminal, Cant, Junction, Sttion Road అని ఉంటాయి. ఇలా విభిన్నంగా బోర్డులపై పేర్లు ఎందుకు ఉంటాయి? వీటి అర్థం ఏంటి?
రైలు ప్రయాణం చేసే సమయంలో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రదేశం నంచి ప్రదేశానికి వెళ్లాలంటే సంబంధిత స్టేషన్ ను గుర్తించాల్సి ఉంటుంది. అయితే అన్ని చోట్ల స్టేషన్లు ఉండవు. ప్రధానంగా రైలు నిలిచే స్టేషన్లకు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా స్టేషన్లు వివిధ పేర్లతో ఉంటాయి. ఇలా పేర్లు ఉండడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలని ఉందా? అయితే ఇవి చూడండి..
కొన్ని స్టేషన్లు central అని ఉంటాయి. ఉదాహరణకు ముంబై సెంట్రల్ స్టేషన్ అని ఉంటుంది. ఇలాంటివి దేశంలో ఐదు మాత్రమే ఉన్నాయి. వీటిలో త్రివేండ్రం సెట్రల్, కాన్పూర్ సెంట్రల్, మంగళూరు సెంట్రల్, ముంబయ్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లు నగరాల మధ్యలో ఉంటాయి. అందువల్ల వీటికి సెంట్రల్ అని ఉంటాయి.
మరికొన్ని స్టేషన్లకు Cant.అని ఉంటుంది. అంటే ఇవి కంటోన్మెంట్ స్టేషన్లు అని అర్థం. అంటే ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఆర్మీ క్యాంప్ ఉందన్న మాట. ఇలా ఉండడం వల్ల ఈ స్టేషన్లకు కంటోన్మెంట్ స్టేషన్లు అని అంటారు. అలాగే ఆర్మీ క్యాంప్స్ ఎక్కడ ఉంటే అక్కడ కంటోన్మెంట్ అని పిలుస్తారు.
ఇంకొన్ని స్టేషన్లకు Road అని ఉంటుంది. ఉదాహరణకు ఆసిఫాబాద్ రోడ్, శ్రీకాకుళం రోడ్ అనే స్టేషన్లు ఉంటాయి. ఇలా పేర్లు ఎందుకు పెడుతారంటే… ఈ రైల్వే లైన్ ఆయా పట్టణాల గుండా వెళ్లడానికి వీలు ఉండదు. అందువల్ల ఈ పట్టణాల సమీపంలో రైల్వే లైన్ ను నిర్మిస్తారు. దీంతో ఆ పట్టణానికి రోడ్ అని యాడ్ చేస్తారు. దీంతో ఆ పేర్లు వచ్చాయి.
ఇక స్టేషన్లకు Terminalఅని ఉంటుంది. ఇలా ఉన్న స్టేషన్లకు ట్రాక్ ఎండ్ ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చిన రైలు తిరిగి రివర్స్ లో వెళ్లాల్సి ఉంటుంది. ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. అందువల్ల ఈ స్టేషన్లను టర్మినెల్ అని పిలుస్తారు. ఈ విధంగా ఆయా స్టేషన్లకు రకరకాల పేర్లు వచ్చాయి. వీటి గురించి తెలుసుకుంటే ఆ స్టేషన్ల గురించి అవగాహన ఉంటుంది.