Sun Rises in the West : తూర్పున ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ.. వర్ణ రంజితమైన ఆకాశాన్ని అలా పరిశీలిస్తూ.. జీవితాన్ని సానుకూల కోణంలో జీవించేవారు చాలామంది ఉంటారు. పైగా ఉదయం సూర్యుడి నుంచి విటమిన్ డీ లభిస్తుంది. అందువల్లే వైద్యులు కూడా ఉదయం వాకింగ్ చేయడం వల్ల ప్రమాదకర కొవ్వు తగ్గుతుందని.. సూర్యుడి నుంచి విటమిన్ డి లభిస్తుందని చెబుతుంటారు. కానీ మీరు చదవబోయే ఈ కథనంలో సూర్యుడు తూర్పున కాదు, పడమర ఉదయిస్తాడు. తూర్పున అస్తమిస్తాడు. వింటుంటే ఆశ్చర్యం అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. ఇదేం మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పుకు సంకేతం కాదు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంతకన్నా కాదు. వాస్తవానికి మన ప్రాంతమే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా సరే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. మంచు దట్టంగా కురిసే హిమాలయాల నుంచి.. ఇసుక హోరెత్తే సహారా ఎడారి వరకు ఇదే సన్నివేశం ఉంటుంది. కాకపోతే సెంట్రల్ అమెరికాలో ఎందుకు భిన్నంగా ఉంటుంది.
ఇంతకీ ఏం జరుగుతుందంటే
మన ప్రాంతంలో సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమించడం సర్వసాధారణం. అయితే పసిఫిక్ మహాసముద్రంలో పడమరను సూర్యుడు ఉదయిస్తాడు. తూర్పున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో అస్తమిస్తాడు. ఈ దృశ్యం చూడ్డానికి ఎంతో విభిన్నంగా ఉంటుంది. సెంట్రల్ అమెరికాలోని పనామా దేశంలో ఈ దృశ్యాన్ని చూడవచ్చు. ఇక్కడ అత్యంత ఎత్తైన ప్రదేశం వాల్కనో బార్ ప్రసిద్ధి చెందింది. అక్కడి నుంచి చూస్తే ఈ దృశ్యం కనిపిస్తుంది. భౌగోళికమైన విభిన్నతల వల్లే ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు..” భూమిపై ఎక్కడైనా సరే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. పశ్చిమ ప్రాంతంలో అస్తమిస్తాడు. కొన్ని ప్రాంతాల్లో తొందరగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా సూర్యుడు ఉదయిస్తాడు. ఉదాహరణకు భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో త్వరగా సూర్యోదయం అవుతుంది. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది. కానీ పనామాలో పశ్చిమ ప్రాంతంలో సూర్యుడు ఉదయిస్తాడు. తూర్పున అస్తమిస్తాడు. పశ్చిమ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. రెండు మహాసముద్రాల మధ్యలో సూర్యుడి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ప్రకృతి ప్రసవించిన ఈ విభిన్నత ఈ భూమి మీద ఇక్కడ మాత్రమే ఉంటుందని” శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇదేమి మనుషుల మనుగడకు పొంచి ఉన్న ముప్పు కాదని.. భౌగోళిక అవరోధం అంతకన్నా కాదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే ఈ దృశ్యం మిగతా వాటికంటే విభిన్నంగా ఉండడంతో.. దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడ నుంచో సందర్శకులు వేలాదిగా తరలివస్తుంటారు. దీంతో వోల్కనో బార్ పర్యాటక ప్రాంతంగా మారింది.