Viral News : భారతదేశం భిన్నత్వంలో ఏకత్తం కలిగిన దేశం. ఇక్కడ మాండలికం, భాష, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రతి 100 కిలోమీటర్లకు మారుతుంటాయి. దీంతో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మారుతున్నాయి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో వివాహాలకు సంబంధించి వివిధ ఆచారాలు ఉన్నాయి. కొన్ని చోట్ల పెళ్లయిన తర్వాత వధువును కర్రతో కొట్టడం ఆనవాయితీ. మరికొన్ని చోట్ల వధువు తల్లి తన అల్లుడి ముక్కును పట్టుకుంటుంది. అయితే, కొన్ని ఆచారాలు వింటే మీరు షాక్ అవుతారు. ఈ ఆచారాలలో కొన్ని వివాహానికి ముందు, కొన్ని వివాహానంతరం నిర్వహిస్తారు. నమ్మడానికి కష్టంగా ఉండే కొన్ని ఆచారాలు ఉంటాయి..వాటిని వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే దేశంలో రోజూ అనేకమైన వింతలు, విచిత్రమైన వార్తలు వింటుంటాం. కాని ఓ అల్లుడు స్వయంగా అత్తను ప్రేమించడం, మామయ్య ముందే పెళ్లి చేసుకున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అత్తా, అల్లుడి చాటు మాటు ప్రేమ వ్యవహారంపై అనుమానం వచ్చిన మామ…వారిద్దరిపై ఓ కన్నేసి ఉంచాడు. అంతే అత్తా, అల్లుడి మధ్య నడుస్తున్న చీకటి ప్రేమ బయటపడింది. ఈ విషయాన్ని అందరికి తెలియాలని ఆ గ్రామ సర్పంచ్ ముందు పంచాయతీ పెట్టాడు. ఊరి పెద్దల ముందు అత్త నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి తన భార్యను చేసుకున్నాడో అల్లుడు. బీహార్ లో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది కూడా.
అయితే సాధారణంగా పెళ్లికి ముందు అమ్మాయి కుటుంబం డ్రగ్స్, మందు, సిగరెట్ అలవాటు లేని అబ్బాయి కోసం వెతుకుతుంది. అబ్బాయి సాదాసీదాగా ఉండాలి. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు. అయితే భారతదేశంలోని ఒక రాష్ట్రంలో, పెళ్లికి ముందు వధువు తల్లి వరుడిని మద్యం సేవించేలా చేస్తుంది. దీని తర్వాత, వధూవరులతో పాటు కుటుంబం మొత్తం కూర్చుని మద్యం సేవిస్తారు. నమ్మడం కష్టం, కానీ ఈ సంప్రదాయం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. ఇక్కడ, పెళ్లి సమయంలో వధువు తల్లి తన కాబోయే అల్లుడికి మద్యం తాపిస్తుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధా జిల్లాలోని బైగా గిరిజన సమాజంలో ఇది ఒక సంప్రదాయం. ఇక్కడ వివాహ సమయంలో మద్యం సేవించే ఆచారం నిర్వహిస్తారు. వరుడి తల్లి మద్యం సేవించడం ప్రారంభించి, ముందుగా వరుడికి మద్యం తాగించేలా చేస్తుంది. విషయం ఇక్కడితో ముగియదు. సంప్రదాయం ప్రకారం, అత్తగారి తర్వాత వధువు తన భర్తకు అంటే వరుడికి మద్యం అందజేస్తుంది. మద్యం సేవించే ఈ ఆచారం ఇక్కడితో ముగియదు. బైగా గిరిజన సమాజంలో వధూవరులు కలిసి కూర్చుని మద్యం సేవిస్తారు. కుటుంబం మొత్తం కూడా వారితో కూర్చుని మద్యం తాగుతారు. దీని తర్వాత మాత్రమే ఇతర వివాహ ఆచారాలు ప్రారంభమవుతాయి.. పెళ్లి వేడుకలు జరుగుతాయి. ప్రత్యేకత ఏమిటంటే గిరిజన సమాజంలో ఎలాంటి లావాదేవీలు జరగవు. అంటే ఇక్కడ కట్నం లాంటి ఆచారాలు ఉండవు. పెళ్లికి వచ్చిన వాళ్లు బహుమతులు కూడా తీసుకురారు.