https://oktelugu.com/

Hospital: ఇండియా కంటే.. అమెరికా హాస్పిటల్స్‌ ఎందుకు ఖరీదైనవో తెలుసా?

సాధారణ జ్వరం అని ఆసుపత్రికి వెళ్తే ఆ టెస్ట్‌లు అని డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే ఇది ఏ ఆసుపత్రికి వెళ్లిన జరుగుతుంది. మరి ఇండియా ఆసుపత్రులతో పోలిస్తే అమెరికా ఆసుపత్రులు ఎందుకు ఖరీదైనవి? దీనికి గల కారణం ఏంటో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2024 / 03:00 AM IST

    Hospital

    Follow us on

    Hospital: ఈ ప్రపంచంలో ఏ ఆసుపత్రికి వెళ్లిన డబ్బులు ఖర్చు కాకుండా ఎవరూ రారు. సాధారణంగా చిన్న జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే చాలు నీరు ఖర్చు అయినట్లు డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ ఆసుపత్రి బిల్లులు భరించలేక కొందరు హెల్త్ ఇన్సూరెన్స్‌లు కూడా తీసుకుంటారు. అయిన కూడా ఇవి కొన్నింటికి మాత్రమే వర్తిస్తాయి. ఇలా ఇండియాతో పోల్చుకుంటే అమెరికా ఆసుపత్రులు చాలా ఖరీదు ఉంటాయి. ఈ ఆసుపత్రిలో చికిత్స చేయాలంటే సామాన్య ప్రజలతో పాటు ధనవంతులు కూడా భయపడతారట. ఆసుపత్రిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా కాస్త ఖరీదు అనేది ఉంటుంది. సాధారణ జ్వరం అని ఆసుపత్రికి వెళ్తే ఆ టెస్ట్‌లు అని డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే ఇది ఏ ఆసుపత్రికి వెళ్లిన జరుగుతుంది. మరి ఇండియా ఆసుపత్రులతో పోలిస్తే అమెరికా ఆసుపత్రులు ఎందుకు ఖరీదైనవి? దీనికి గల కారణం ఏంటో చూద్దాం.

    భారత్‌లో కంటే అమెరికాలో ఆసుపత్రుల్లో ఖర్చు ఎక్కువగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. భారత దేశంలో తలసరి ఆదాయం 1700 డాలర్లు ఉంటుంది. అదే అమెరికాలో అయితే 57000 డాలర్లు ఉంటుంది. అంటే భారత్ తలసరి ఆదాయం కంటే అమెరికా తలసరి ఆదాయం దాదాపుగా 30 రెట్లు ఎక్కువ. అలాగే ఇండియా కంటే అమెరికాలో వైద్య సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా ఎక్కువ ఖర్చు ఉంటుంది. అమెరికాతో పోలిస్తే ఇండియాలో జీతాలు తక్కువ. ఈ కారణం వల్ల కూడా అమెరికా కంటే ఇండియాలో వైద్యం తక్కువకు లభిస్తుంది. ఇండియాలో చాలా ఫేక్ డాక్టర్లుగా మారుతారు. కానీ అమెరికాలో బాగా అందులో ప్రావీణ్యం పొందిన తర్వాత మాత్రమే వారికి అనుమతి ఉంటుంది. ఇండియాతో పోలిస్తే అమెరికాలో అన్నింటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి.

    ఇండియాలో చాలా వరకు వైద్యానికి ఇన్సూరెన్సులు ఉపయోగపడతాయి. కానీ అమెరికాలో మాత్రం అన్నింటికి ఇన్సూరెన్సులు ఉపయోగపడవు. అలాగే అమెరికా దేశం దిగుమతి చేసే మందులు కూడా కాస్త నాణ్యమైనవే ఉంటాయి. మన ఇండియాలో ఎక్కువ శాతం వరకు నకిలీ మందులు దిగుమతి చేస్తారు. కొన్ని మందుల్లో అయితే నాణ్యత లేకుండా తయారు చేస్తారు. ఇలాంటి కారణాల వల్ల కూడా ఇండియాలో వైద్యం అమెరికా కంటే చీప్‌గా ఉంటాయి. ఇందుకేనేమో.. దేశంలో ఎవరికైనా అధికంగా అనారోగ్య సమస్యలు వస్తే అమెరికా వంటి దేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటారు. కేవలం ధనవంతులు మాత్రమే ఇలా విదేశాలకు వెళ్లి చికిత్స చేయించకుంటారు. సాధారణ మనుషులకు సరైన వైద్యం లేక అలానే మరణిస్తారు. ఎందరో సెలబ్రిటీలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులతో పోరాడి గెలిచారు. వీళ్లలో ఎక్కువ మంది విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్న వారు ఉంటారు.