https://oktelugu.com/

Snake : పాము ముట్టుకోగానే చనిపోతుంది.. కానీ మళ్లీ బతుకుతుంది.. ఎలాగో ఈ వీడియోలో చూడండి..

కొన్నిపాములు ఎగురుతూ ఉంటాయి. కానీ ఈ పాము మాత్రం ముట్టుకోగానే చనిపోతుంది. కానీ కాసేపటి తరువాత మళ్లీ బతుకుంది. అలా కావడానికి కారణం ఏంటి? ఇంతకీ అది ఏ పాము? ఆ వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : December 16, 2024 / 03:10 AM IST

    Hognose Snake

    Follow us on

    Snake :  ఈ సాధారణంగా పాము పేరు చెప్పగానే చాలా మంది వణికిపోతుంటారు. దానిని చూసి దూరంగా వెళ్లిపోతారు. పాములు అంటే మనిషికి ఎంత భయమో.. మనుషులు అంటే పాములకు కూడా అంతే భయం. అయితే వాటి రక్షణ కోసం అవి దాడి చేస్తుంటాయి. అందుకే కొందరు జంతు ప్రేమికులు పాములు కనిపిస్తే వాటిని చంపకుండా దూరం ఉండాలని లేదా వాటిని అడవిలో విడిచిపెట్టే ప్రయత్నాలు చేయాలని కోరుతూ ఉంటారు. ప్రపంచంలో అనేక రకాల సర్పాలు ఉన్నాయి. కొన్ని మనం ఊహించని విధంచి చిన్నగానూ..మరికొన్ని పెద్దగానూ ఉంటాయి. కొన్నిపాములు ఎగురుతూ ఉంటాయి. కానీ ఈ పాము మాత్రం ముట్టుకోగానే చనిపోతుంది. కానీ కాసేపటి తరువాత మళ్లీ బతుకుంది. అలా కావడానికి కారణం ఏంటి? ఇంతకీ అది ఏ పాము? ఆ వివరాల్లోకి వెళితే..

    చేతిలోకి మొబైల్ వచ్చాక… ఎక్కడ ఏం జరుగుతుందో.. ఎలాంటి భూమ్మీద ఎలాంటి జీవులు ఉన్నాయో తెలుసుకోగలుగుతున్నారు. కొందరు విచిత్రమైన జీవులు, సంఘటనలు చూసిన వెంటనే వాటని మొబైల్ లో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వీటిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాగే తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము చేసే యాక్టింగ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. తనని రక్షించుకుందనే పాము ఏం చేస్తుందంటే?

    ప్రపంచంలో ఉన్న పాముల జాతుల్లో హగ్నోస్ ఒకటి. ఇది విషపూరితమైన పాముల్లో ఒకటి. దీని పొడవు 30 అంగుళాలు. చిన్న చిన్న కీటకాలు, పక్షులు దీని ఆహారం. మిగతా పాములకంటే హగ్నోస్ పాము భిన్నం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సినిమా హీరో కంటే ఎక్కువగా నటిస్తుంది. ఏదైనా ఇతర ఇతర జీవులు తన శరీరానికి తాకినట్లు అనిపించగానే ఇది వెంటనే చనిపోతుంది. ఆ తరువాత రక్తం కక్కుతూ దుర్వాసన కలిగిన మలం ను విడుదల చేస్తుంది. దీంతో దీనిని దాడి చేయడానికి వచ్చిన జీవులు ఇది చనిపోయిందని అనుకుంటారు. ఆ తరువాత ఇది మళ్లీ యథాస్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హగ్నోస్ పాము నాలుగు రంగుల్లో ఉంటుంది. బూడిద, గోధుమ, పసుపు రంగుల్లో ఉంటాయి. కానీ ఎక్కువగా బ్లాక్ లో ఉన్న పాములే కనిపిస్తాయి. ఆడ హగ్నోస్ పాములు ఎక్కువ కాలం జీవిస్తాయి. ఇవి 15 సంవత్సరాల వరకు జీవించగలవు.

    ఆశ్చర్యకరమేంటంటే.. హగ్నోస్ పాముల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండవు. ఎందుకంటే ఇవి కొద్దిపాటి విషాన్ని మాత్రమే విడుదల చేస్తాయి. ఇవి మనుషులను కాటు వేస్తే మండుతాయి. కానీ ఎలాంటి ఆపాయం ఉండదు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ వ్యక్తి తన చేతితో బ్లాక్ కలర్లో ఉన్న హగ్నోస్ పామును తాకుతాడు. వెంటనే అది చనిపోయినట్లు నటిస్తుంది. కానీ ఆ తరువాత బతికి తన దారి వెంట వెళ్తుంది. ఈ వీడియోపై చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.