Happy Divorce Celebration: పెళ్లి అంటే నూరేళ్ల పంట.. మన హిందూ సంప్రదాయంలో వివాహానికి గౌరవం, ప్రాధాన్యత ఉన్నాయి. అయితే పాశ్చాత్య పోకడలు, సెల్‌ఫోన్ కారణంగా పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. ఇత ఇటీవల పెళ్లిన ఎంత ఆడంబరంగా జరుపుకుంటున్నారో.. విడాకులను అంతే ఆడంబరంగా జరుపుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు భార్యకు విడాకులు ఇచ్చి.. పండుగ చేసుకున్నాడు. భార్యతో విడిపోయి ఇంటికి చేరుకున్న తన కుమారుడికి తల్లి పాలతో స్నానం చేయించింది. కొత్త దుస్తులు వేయించి తర్వాత ప్రత్యేక కేక్ కట్ చేయించింది.
‘‘హ్యాపీ డివోర్స్’’ కేక్ కథ
విడాకుల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అతను కట్ చేసిన కేక్‌పై ‘‘హ్యాపీ డివోర్స్ – 120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు’’ అనే వాక్యాలు రాయబడి ఉండటం ఈ ఘటనకు మరింత వైరల్ ఇంపాక్ట్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది వినోదంగా తీసుకున్నా, మరికొందరు ఇలాంటి సంబరాలు సామాజిక విలువలను తప్పుదారికి నెడుతున్నాయని విమర్శించారు. ‘‘జీవితంలో కొత్త మొదలు’’గా కొందరు చప్పట్లు కొడితే, ‘‘వివాహ బంధాన్ని ఈ స్థాయికి తేలిగ్గా తీసుకోవడం సరైన ధోరణి కాదని’’ మరికొందరు హెచ్చరించారు.
సమాజ ధోరణిలో మార్పు
ఇలాంటి ఘటనలు ఇప్పుడు వివాహం, విడాకులు వంటి వ్యక్తిగత విషయాల్లో ప్రజలు చూపుతున్న కొత్త ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత నిర్ణయాలను తక్షణ ఉత్సాహంతో సెలబ్రేట్ చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది. ఆనందానికి హద్దులు కల్పించకపోవడమే కాక, వ్యక్తిగత బాధలపై సామాజిక హాస్యం కూడా సమాజంలో కొత్త చర్చలను ప్రారంభిస్తోంది.
విడాకుల్లో ఇరువురికీ ఉన్న భావోద్వేగ భారాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఇలాంటి సంబరాలు ఒక పక్షం గెలిచిందన్న భావనను బలపరుస్తాయి. నిపుణులు సూచన ఏమిటంటే – వ్యక్తిగత విముక్తిని ఆనందంగా స్వీకరించవచ్చుగానీ, మరొకరి గాయంపై ఉత్సవం చేయడం సమాజంలో ఒత్తిడులను మరింత పెంచుతుంది.