spot_img
Homeవింతలు-విశేషాలుHanging Coffins Tradition: అక్కడ శవపేటికలు గాల్లో వేలాడుతూ ఉంటాయి.. చూసేవాళ్ళ గుండెలు గులాబ్ జాములే..

Hanging Coffins Tradition: అక్కడ శవపేటికలు గాల్లో వేలాడుతూ ఉంటాయి.. చూసేవాళ్ళ గుండెలు గులాబ్ జాములే..

Hanging Coffins Tradition: ఏ మనిషికైనా సరే చావు అనేది కచ్చితంగా వస్తూ ఉంటుంది.. పుట్టుక గురించి తెలుస్తుంది గానీ.. చావు గురించి తెలియదు. చనిపోయిన తర్వాత మృతదేహాలను వారి వారి ఆచారాల ఆధారంగా ఖననం లేదా దహనం చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భద్రపరుస్తూ ఉంటారు. ఈజిప్ట్ లాంటి ఏరియాలలో పిరమిడ్ల మాదిరిగా రూపొందిస్తుంటారు. చనిపోయిన వ్యక్తి తాలుకు జ్ఞాపకాలను భద్రపరచుకోవడంలో ఒక్కో దేశంలో ఒక్కో తీరైన ఆచారం కొనసాగుతూ ఉంటుంది.

మనదేశంలో చనిపోయిన వారి పార్థివదేహాలను దహనం లేదా ఖననం చేస్తూ ఉంటారు. కొన్ని మతాల సాంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారి అస్థికలను నదులలో కలుపుతుంటారు. పితృ కర్మలు నిర్వహిస్తూ ఉంటారు.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఖననం చేస్తుంటారు. ప్రత్యేకంగా తయారుచేసిన శవపేటికలలో మృతదేహాలను భద్రపరిచి.. ఆ తర్వాత భూమిలో గొయ్యి తీసి.. మట్టి కప్పి పెడతారు. ఆ తర్వాత దానిమీద సమాధులు నిర్మిస్తారు. ప్రతి ఏడాది వారి జయంతి రోజున.. వర్ధంతి రోజున స్మృత్యర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

పిలిపిన్స్, ఇండోనేషియా, చైనా ప్రాంతాలలో మాత్రం ఇందుకు విరుద్ధమైన సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ శవపేటికలను గాలిలో వేలాడదీస్తారు. ఈ ఆచారం అక్కడ చాలా సంవత్సరాలుగా ఉంది. అక్కడ చనిపోయిన వారి మృతదేహాలను భూమిలో పాతిపెట్టారు. కొండ అంచుల దాకా లేదా గుహల గోడలకు వేలాడదీస్తూ ఉంటారు. శవపేటికలు ఎంత ఎత్తులో ఉంటే.. ఆత్మలు అంత త్వరగా స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతుంటారు. ఈ పద్ధతిని మృతదేహాలను యానిమల్స్ నుంచి రక్షించుకోవడానికి సహాయపడుతుందని అక్కడివారు నమ్ముతుంటారు.. పైగా శవపేటికలను వేలాడదీస్తున్నప్పుడు అక్కడివారు ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటారు. బంధువులు తప్ప మిగతావాళ్లు అక్కడికి రారు.

శవపేటికలను గాలిలో వేలాడదీసిన తర్వాత.. ఈ విషయాన్ని చాలా రోజుల తర్వాత బయటకు చెబుతారు. వర్ధంతి లేదా జయంతి రోజు అక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేస్తారు. శవపేటికలు అక్కడ గాలిలో వేలాడుతూ ఉండడం కొంతమందికి భయం కలిగిస్తు ఉంటుంది. రాత్రిపూట అక్కడికి వెళ్లాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఆత్మలు అక్కడ సంచరిస్తాయని.. రాత్రిపూట అక్కడి వాతావరణం చాలా విచిత్రంగా మారుతుందని స్థానికులు చెబుతుంటారు. ఆ టైంలో అక్కడికి గనుక వెళ్తే గుండెలు గులాబ్ జాములు అయిపోతాయని భయపడుతుంటారు.
Hanging coffins in the Philippines

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version