Site icon OkTelugu

Great Wall Of India Kumbhalgarh: చైనా లోనే కాదు.. మన దగ్గరా ఉంది ఓ గ్రేట్ వాల్.. ఇంతకీ దీని విశేషాలు ఏంటంటే..

Great Wall Of India Kumbhalgarh

Great Wall Of India Kumbhalgarh

Great Wall Of India Kumbhalgarh: వందల కిలోమీటర్లు.. పర్వతప్రాంతాలను కలుపుతూ.. అత్యంత బలంగా.. పటిష్టంగా ఉంటుంది ఆ నిర్మాణం. అంతరిక్షం నుంచి చూసినా సరే కనిపిస్తూ ఉంటుంది. మానవ నిర్మితాలలో అతి గొప్ప నిర్మాణమైన ఆ కట్టడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందంటే.. దాని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు..

ఇంతకీ ఆ కట్టడం మరేమిటో కాదు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. డ్రాగన్ దేశంలో ఆ గోడను చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఆ గోడ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ప్రపంచ వింతల్లో ఒకటిగా ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి ఎన్నో రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ గోడను శత్రు దేశాల నుంచి కాపాడేందుకు నిర్మించారని.. దాని నిర్మాణంలో అనేక రకాలైన పదార్థాలను వాడారని.. అందువల్లే అది ఆ స్థాయిలో దృఢంగా ఉందని చరిత్రకారులు చెబుతుంటారు.

చైనాకు మాత్రమే కాదు, మన దేశంలో కూడా గోడ ఉంది. ఆ గోడ పేరు గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తుంటారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని కుంభాల్ గడ్ ప్రాంతంలో ఉంది. ఈ గోడను గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. ఇది 36 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద కూడా ఇది. 15వ శతాబ్దంలో రానా కుంభ దీని నిర్మించారు. ఆరవలి పర్వతల మధ్య ఉన్న ఈ గోడపై ఒకేసారి 8 గుర్రాలు పక్కపక్కన వెళ్లవచ్చు. ఈ కోట మీద 360 కి పైగా ఆలయాలు ఉన్నాయి. శత్రువుల నుంచి కాపాడేందుకు ఈ గోడను నిర్మించారు. ఎన్నో సందర్భాలలో శత్రువులు ఈ గోడమీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆలయాలలో ఉన్న సంపదను తస్కరించడానికి ప్రయత్నించారు. ఎన్నడూ కూడా విజయం సాధించలేకపోయారు. ఈ గోడ వల్లే శత్రువులు ఆలయాలను ఏమీ చేయలేకపోయారని చరిత్రకారులు చెబుతుంటారు.

ఈ గోడ యునెస్కో గుర్తింపు పొందింది. అత్యంత చారిత్రాత్మకమైన కట్టడం గా ఇది పేరు తెచ్చుకుంది.. ఈ కట్టడాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులు వస్తుంటారు. ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేవారు.. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాను కచ్చితంగా దర్శిస్తారు.

గోడ నిర్మాణంలో ఎటువంటి పదార్థాలు వాడారో ఇప్పటికీ ఒక రహస్యమే. కాకపోతే ఇందులో డంగు సున్నం, బంక మట్టి, క్రమ పద్ధతిలో ఇటుకలు.. ప్రత్యేకమైన కలప వాడినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. కాకపోతే ఆ బంక మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. డంగు సున్నాన్ని ఎలా తయారు చేశారు.. ఆ కలప వాడే విధానంలో ఎటువంటి ప్రక్రియలు పాటించారు.. అనే విషయాలపై ఇప్పటికి స్పష్టమైన సమాచారం లేదు. చరిత్రకారులు అనేక రకాలైన పరిశోధనలు చేసినప్పటికీ ఆ పదార్థాల లభ్యత గురించి ఇంతవరకు స్పష్టమైన సమాచారం తెలియ రాలేదు.

Exit mobile version