Riyadh: గల్ఫ్ దేశాలు దుబాయ్, రియాద్, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాలు.. ఈ దేశాల నుంచి భారత కార్మికులు ఉపాధి కోసం ఏటా వలస పోతుంటారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలోల ఉంటున్నారు. ఇక ఈ దుబాయ్‌లో వాన చినుకు ఎప్పుడో కాని కనిపించదు. చెరవులు, కుంటలు అస్సలే కానరావు. పచ్చగడ్డి, పచ్చని చెట్లు కానరావు. 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి. ఇలాంటి దుబాయ్‌లో కొన్ని రోజులుగా వింత వాతావరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆరునెలల క్రితం దుబాయ్‌లో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటీ వింత అనుకున్నారు. మండే ఎడారిలో వరదలు ఏంటని ముక్కున వేలేసుకున్నారు. తాజాగా రియాద్‌లో ఏకంగా మంచు కురిసింది. సౌదీ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని వాతావరణం చూసి ఆందరూ ఆశ్చర్యపోతున్నారు.
అల్–జోఫ్ ప్రాంతంలో..
స్థానిక మీడియా కథనం ప్రకారం.. రియాద్‌లోని అల్–జోఫ్ ప్రాంతంలో భారీగా మంచు కురిసింది. దేవంలో తొలిసారిగా శీతాకాలపు వాతావరణం కనిపించింది. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం, వడగళ్ల వానలు పడడం హిమపాతం ఏర్పడడం అనేది ఎన్నడూ జరగలేదు. అల్–జోఫ్ ప్రాంత ప్రజలు ఉదయం నిద్రలేవగానే తెల్లని మంచు చూసి సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ హిమపాతాన్ని, జలపాతాలను హైలైట్ చేస్తోంది. రానున్న రోజుల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపింది. భారీ వర్షాలతోపాటు వడగళ్ల వానలు కురుస్తాయని తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గతంలో యూఏఈలో..
గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఇలాంటి వింత వాతావరణ మార్పులు కనిపించాయి. యూఏఈతో ఓ ప్రాంతంలో గడ్డి మొలిచిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చాయి.