Doomsday Fish India: ఈ ప్రకృతిలో చోటుచేసుకునే ప్రతి మార్పు ఏదో ఒక విషయాన్ని బయటకు వెల్లడిస్తుంది. ఉదాహరణకి కప్పలు అరిస్తే వానలు వస్తాయని.. నక్కలు ఊలలు పెడితే ప్రమాదం సంభవిస్తుందని.. కుక్కలు గట్టిగా అరిస్తే ఏదో ప్రమాదం పొంచి ఉందని మన పెద్దలు చెబుతుండేవారు. వారు చెప్పినట్టుగానే అవి జరుగుతుండేవి.
మనుషుల కంటే జంతువులకు ఘ్రాణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అవి చిన్న చిన్న శబ్దాలను కూడా వింటాయి. ఆశబ్దాలలో మార్పు ఆధారంగా ప్రమాద సంకేతాలను సూచిస్తూ ఉంటాయి. పైగా వాటికి చూపు కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అందువల్లే అవి ప్రమాదకారక దృశ్యాలను చూసి వెంటనే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాయి. అందువల్లే జంతువులు భిన్నంగా వ్యవహరిస్తే.. కచ్చితంగా అది కీడుకు సంకేతం అని మన పెద్దలు భావించేవారు.
ఇతర దేశాలలో కూడా
కేవలం మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. నేటి శాస్త్రీయ కాలంలో ఇలాంటివి కూడా జరుగుతాయా? అనే ప్రశ్నను కాస్త పక్కన పెడితే.. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇటువంటి నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.. సరిగ్గా 2011లో జపాన్ దేశంలో డూ మ్స్ డే అనే చేప దొరికింది.. వాస్తవానికి ఈ చేప చాలా పొడవుగా ఉంటుంది. చూసేందుకు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ చేప అక్కడ జాలర్లకు లభించిన తర్వాత జపాన్ దేశంలో భూమిలో కదలికలు చోటుచేసుకున్నాయి. ఆ ప్రమాదం వల్ల దాదాపు అక్కడ వేలాది మంది చనిపోయారు. కనీ విని ఎరుగని స్థాయిలో నష్టం చోటుచేసుకుంది. 2023లో తైవాన్ దేశంలో జాలర్లకు ఆ చేప లభించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ దేశంలో అత్యంత భారీ భూకంపం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఆ దేశంలో చాలామంది చనిపోయారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఇక నష్టమైతే అంచనాలకు అందకుండా పోయింది. ఇక ఇప్పుడు మనదేశంలో ఈ చేప లభించింది. ఈ చేప చూసేందుకు చాలా విచిత్రంగా ఉంటుంది. అత్యంత పొడవుగా ఉంటుంది. మనదేశంలో ఈ చేప లభించిన నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 200 మందికి పైగా చనిపోయారు. దాదాపు అంతే సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.
Also Read: Flying Fish : ఈ చేప ఈదడంతో పాటు గాల్లో ఎగురుతుంది కూడా.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
మూఢనమ్మకమని కొట్టిపారేస్తున్నారు
అయితే ఈ చేప మనదేశంలో లభించిన నేపథ్యంలో.. రకరకాల ప్రచారాలు జరుగుతున్న సమయంలో కొంతమంది కొట్టిపారేస్తున్నారు.. చేప లభించినంతమాత్రాన ప్రమాదాలు జరగవని.. అనూహ్య మార్పులు, ప్రకృతిలో చోటుచేసుకునే విపరీతాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని.. చేప లభించినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని అనుకోవడం సరికాదని కొంతమంది మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ చేప లభించిన సందర్భాలలో ప్రమాదాలు జరిగాయని చెప్పడం సరికాదని.. ఇది తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుందని కొంతమంది మేధావులు పేర్కొంటున్నారు.
#DOOMSDAYFISH Nature is trying to convey something to us, or just superstition
In two separate incidents this week, rare deep-sea oarfish — nicknamed “doomsday fish” — have washed up on beaches in Tamil Nadu, India, and Tasmania, stirring ancient legends and online… pic.twitter.com/o7v9JsM3OH
— Chennai Weather-Raja Ramasamy (@chennaiweather) June 6, 2025