Homeవింతలు-విశేషాలు50 rupee note worth lakhs: మీ దగ్గర ₹50 నోటు ఉందా.. లక్షల డబ్బు...

50 rupee note worth lakhs: మీ దగ్గర ₹50 నోటు ఉందా.. లక్షల డబ్బు మీదే!

50 rupee note worth lakhs: శీర్షిక చదివారు కదూ.. 50 రూపాయల నోటు తో లక్షల ఆదాయం ఎలా వస్తుంది? అనే అనుమానం మీలో వ్యక్తం అవుతుంది కదా.. మీకే కాదు.. చాలామందికి ఇలాంటి అనుమానమే వస్తుంది.

నేటి కాలంలో 50 రూపాయలకు టిఫిన్ కూడా రాదు. అలాంటిది 50 రూపాయలకు లక్షల ఆదాయం ఎలా వస్తుంది? అనేది కదా మీ డౌట్.. మనలో చాలామందికి పాత నోట్లను సేకరించడం అలవాటు. ఇంగ్లీషులో పాత నోట్లను సేకరించే అలవాటును Numismatics అని పిలుస్తుంటారు.. డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడకం పెరిగిన తర్వాత కరెన్సీ అనేది అంతగా కనిపించడం లేదు. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న కరెన్సీ నోట్లకు ఆన్లైన్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఒక యాభై రూపాయల నోటు జీవితాలను మార్చే అవకాశం ఉంది. ఆ నోటుకు విపరీతమైన డిమాండ్ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.

చాలామంది పాత నోట్లను అత్యంత సులువుగా తీసుకుంటారు. అయితే కొన్ని కరెన్సీ నోట్లు చూస్తుండగానే ఐశ్వర్యవంతులను చేస్తాయి. అటువంటి నోట్లలో ఈ 50 రూపాయల నోటు కు డిమాండ్ ఉంది. ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న ఈ 50 రూపాయల నోటుకు ఏకంగా లక్షలు లభించే అవకాశం ఉంది.

పాత నోట్లను చాలామంది సేకరిస్తారు. అయితే అందరి దగ్గర ఉన్న పాత నోట్లకు భారీగా ధర పలికే అవకాశం ఉండదు. ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న కరెన్సీ నోట్లకు మాత్రమే భారీగా ధర పలుకుతుంది.

నెంబర్ 786

కొంతమంది 786 నెంబర్ ను అత్యంత ప్రముఖమైనదిగా భావిస్తుంటారు. కరెన్సీ నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్లో ప్రారంభంలో లేదా చివర్లో 786 కనుక ఉంటే ఆ నోట్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఒకవేళ ఆ నోటు గనుక మీ దగ్గర ఉంటే లక్షలు దక్కినట్టే.

మనలో చాలామందికి ఫ్యాన్సీ నెంబర్లు అంటే చాలా ఇష్టం. ఆ నెంబర్ల కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. 000001 అనే సంఖ్యలు మొదటి నెంబర్లుగా ఉన్న నోట్లకు డిమాండ్ ఉంటుంది. 111111, 123456 వంటి నెంబర్లను కూడా అత్యంత వ్యాల్యూ ఉన్న వాటిగా భావిస్తుంటారు.. 896698 ఇలా ఎటువైపు చదివినా ఒకే విధంగా కనిపించే నెంబర్లు ఉన్న నోట్లు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఒకవేళ కరెన్సీ నోటు మీద ప్రింటింగ్ లోపాలు.. డబుల్ ప్రింటింగ్ వంటివి చేసుకున్నప్పుడు నంబర్లు తప్పుగా పడతాయి. వాటిని కూడా అరుదైన నోట్లుగా చెబుతుంటారు.

1950,60 ల కాలంలో ముద్రించిన నోట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ నోటు స్థితిని.. దానికున్న స్థాయిని బట్టి ధర పలుకుతుంది. 786 నెంబర్ ఉన్న 50 రూపాయల నోటుకు దాదాపు 5 లక్షల వరకు దక్కుతాయని తెలుస్తోంది. మరోవైపు ఫ్యాన్సీ నెంబర్ నోట్లకు 5000 నుంచి 50,000 వరకు పలుకుతున్నది.

ఈ అరుదైన నోట్లను కాయిన్ బజార్, ఈ బజార్ ఓఎల్ఎక్స్ లో అధికారికంగా రిజిస్టర్ అయినవారు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో అరుదైన నోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే నోట్లను విక్రయించాలంటే ఆయా సైట్లలో రిజిస్టర్ అయి ఉండాలి.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular