Clouds touching sea అలల తాకిడితో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అదే సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి. ఆ మేఘాల సమూహం ఒక్కసారిగా వాతావరణం మార్చేసింది. మేఘాలు అలముకోవడంతో వాతావరణం కాస్త చీకటిగా మారింది. పట్టపగటి పూట రాత్రి వాతావరణం ఏర్పడింది. దీంతో వర్షం వస్తుందని స్థానికులు అనుకున్నారు. ఆ బీచ్ లో ఆటలాడుతున్న వారు కూడా ఆ వాతావరణంలో చూసి ఒక రకంగా భయపడ్డారు. ఎందుకైనా మంచిదని వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతలోనే మేఘాలలో అనూహ్యమైన కదలిక ఏర్పడి. ఆ మేఘాలు ఒక ప్రాంతం వైపు చీలిపోయి సముద్రాన్ని తాకినట్టుగా కనిపించాయి. సముద్రంలో నీటిని తాగినట్టుగా దర్శనమిచ్చాయి.
ఈ అద్భుతమైన దృశ్యం పోర్చుగల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ వీడియోను కొంతమంది తమ ఫోన్లలో తీసి సోషల్ మీడియాలోకి ఎక్కించారు. అది కాస్త వైరల్ గా మారింది.. పోర్చుగల్ ప్రాంతంలో ఉన్న ఓ సముద్ర తీరంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది. అప్పటిదాకా వాతావరణం పొడిగా ఉంది. క్షణాల్లోనే మారిపోయింది. అంతే గట్టమైన మేఘాలు ఆకాశాన్ని ఆవరించాయి. వర్షం కురువక పోయినప్పటికీ ఆ మేఘాలు ఒకవైపు వెళ్లిపోయి సముద్రంలో ఉన్న నీటిని తాగినట్టుగా దర్శనమిచ్చాయి. వాస్తవానికి ఇలాంటి దృశ్యాలు అరదుగా మాత్రమే చోటు చేసుకుంటాయి. ఈ దృశ్యాలను కొంతమంది ఔత్సాహికులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. మేఘాలు ఒకవైపు కదిలినప్పుడు సముద్రంలో అలల తాకిడి మరింత పెరిగింది. అప్పటిదాకా ఒక స్థాయి వరకు వచ్చిన అలలు ఆ తర్వాత మరింత పెరిగాయి. అలలు అంతెత్తున దూకుకుంటూ వస్తూ సముద్ర తీరాన్ని తాకాయి . ఆ సమయంలో అక్కడి వాతావరణం గంభీరంగా కనిపించింది. బీచ్ లో సేద తీరుతున్న పర్యాటకులు అక్కడి వాతావరణం చూసి భయపడ్డారు. ఆ తర్వాత వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు.
అయితే ఇటువంటి దృశ్యాలు అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.. సముద్రంలో అప్పుడప్పుడు ఆకస్మికంగా కదలికలు చోటు చేసుకుంటాయని.. ఆ కదలికల వల్ల సముద్రం ఉపరితలంలో ఉన్న జలాలు మొత్తం ముందుకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆకాశంలో మేఘాలు ఒకవైపు ఏర్పడటం వల్ల సముద్ర జలాలు ఆకర్షితమవుతాయని.. ఆ సమయంలో వాటిల్లో ఆటుపోట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు..” ఇలాంటి దృశ్యాలు అరుదుగా చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా తుఫాన్లు ఏర్పడేటప్పుడు ఇటువంటి వాతావరణం ఉంటుంది. వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పుడు ఈ వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం వల్ల సముద్రం మార్పులకు గురవుతుంది. ఆకాశం కూడా దట్టమైన మేఘాలతో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక రకమైన సంకేతాలు ఇస్తుంటాయి. అయితే ఇలాంటి సమయంలో సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉండడం మంచిది. సముద్రంలో చోటుచేసుకునే కదలికల వల్ల జంతువులు తాకిడికి గురవుతాయి. అప్పుడు అవి తీర ప్రాంతాలకు వస్తుంటాయి. అలాంటి సమయంలో తీరప్రాంతాల్లో ఉన్నవారు దూరంగా ఉండడం మంచిదని” నిపుణులు చెబుతున్నారు.