Homeవింతలు-విశేషాలుBali Resort Incident: రిసార్ట్ లో తెగించారు.. ఇండియా పరువు తీశారు కదరా

Bali Resort Incident: రిసార్ట్ లో తెగించారు.. ఇండియా పరువు తీశారు కదరా

Bali Resort Incident: మనుషులలో ఎంతటి గొప్ప గుణాలు ఉన్నా సరే.. కక్కుర్తి అనేది ఉండకూడదు. దానివల్ల నలుగురిలో నవ్వుల పాలు అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత చింతించినప్పటికీ ఉపయోగము ఉండదు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఈ కుటుంబానికి ఎదురైంది. చివరికి తలదించుకోవాల్సి వచ్చింది. వారు చేసిన పని వల్ల భారతదేశం కూడా తల వంపులకు గురికావాల్సి వచ్చింది.

ఎంత డబ్బు ఉన్నా సరే కొంతమందిలో కక్కుర్తి బుద్ధి అనేది అసలు పోదు. తినే తిండి దగ్గర.. తాగే నీటి దగ్గర.. ఉండే వసతి దగ్గర.. ఇలా ప్రతి విషయంలో కొందరు కొంచెపు బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. దీనివల్ల ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతుంటాయి.. అటువంటి పరిణామమే ఈ కుటుంబానికి ఎదురైంది.. భారీగా డబ్బు ఖర్చు పెట్టుకుని విహారయాత్రకు వెళ్లిన వారికి.. దారుణమైన అనుభవం ఎదురయింది. వారు చేసిన పనే ఇంతటి చర్చకు కారణమైంది.

భారతదేశానికి చెందిన ఒక కుటుంబం లక్షల ఖర్చుపెట్టి విహారయాత్రకు ఇండోనేషియా లోని బాలి ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఉబుద్ అస్వర్ రిసార్ట్ లో బస చేసింది. ఈ నెల 16 నుంచి 19 వరకు వారు అందులో ఉన్నారు. రిసార్ట్ నుంచి బయటికి వచ్చే సమయంలో వారు ఉన్న గదులను సిబ్బంది పరిశీలించారు. టవల్స్, రిమోట్ వంటి వస్తువులు హోటల్ రూమ్లో కనిపించలేదు. దీంతో హోటల్ నిర్వాహకులలో అనుమానం కలిగింది. దీంతో వారి లగేజీ మొత్తం పరిశీలించగా.. అందులో ఉన్న వస్తువులు మొత్తం బయటపడ్డాయి. టీవీ రిమోట్, టవల్స్ బయటపడడంతో.. వారి వ్యవహారం బాహ్య ప్రపంచానికి తెలిసింది.. రిసార్ట్ సిబ్బంది తనిఖీలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

” ఇండియా పరువు తీశారు. ఎక్కడో విదేశాలకు వెళ్లి విహరించిన తర్వాత.. ఇలాంటి పనులకు పాల్పడటం దారుణం.. టీవీ రిమోట్, టవల్ దొంగిలించడం సరికాదు. ఇటువంటి పనుల వల్ల వారికి ఆనందం కలుగవచ్చు. కానీ భారతీయుల పరువు పోతుంది. ఆ విషయం తెలియని వీరు అలా చేయడం సిగ్గుచేటు. పైగా అంత డబ్బు ఖర్చు పెట్టుకుని విదేశాలకు వెళ్లినవారు.. ఇలాంటి పనికి మాలిన పనులు చేయడం నిజంగా దారుణమని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular