Homeవింతలు-విశేషాలుArrogance Lesson Story: నేనే తోపు.. దమ్ముంటే ఆపు అనే వాళ్లకు.. ఇతడి పొగరు ఓ...

Arrogance Lesson Story: నేనే తోపు.. దమ్ముంటే ఆపు అనే వాళ్లకు.. ఇతడి పొగరు ఓ గుణపాఠం

Arrogance Lesson Story: అంతా నేనే.. మొత్తం నేనే.. జరిగేది నా వల్లే.. నేనే సర్వాంతర్యామి.. ఇదిగో ఇలాంటి వ్యక్తిత్వం చాలా మందిలో ఉంటుంది. ఒక మనిషిలో అహం అనేది పెరిగిపోతే దానిని ఎవరూ నియంత్రించలేరు. కాకపోతే ఆ అహం దెబ్బ తినడానికి ఎంతో సమయం పట్టదు. ఆ సమయమే అతడిని భూమి మీద నిలబడేలా చేస్తుంది. ఇతడి విషయంలో అది నూటికి నూరు శాతం నిజమైంది.

డిలావర్ మారథాన్.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.. ఈ మారథాన్ లో గొప్ప గొప్ప అథ్లెట్లు పాల్గొంటారు. వారంతా కూడా తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. అయితే ఈ ఈవెంట్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. లక్ష్యం చేరేవరకు ఎవరైనా సరే విశ్రమించకూడదని.. అది ఆటగాడైనా సరే.. సామాన్య మనిషైనా సరే.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని నిరూపిస్తోంది.

ఈ మారథాన్ లో కార్సన్ మెల్లో అనే అథ్లెట్ పాల్గొన్నాడు. అతడు జింక మాదిరిగా పరుగుపెట్టాడు. చివరికి ఫినిషింగ్ లైన్ వద్దకు వచ్చేసాడు. తాను ఎలాగూ గెలిచానని సంబరాలు మొదలుపెట్టాడు. అప్పటికి తన పరుగులో వేగం తగ్గించి డాన్సులు చేయడం మొదలుపెట్టాడు. కానీ అతని వెనుక చిరుత పులి మాదిరిగా జోషువా జాక్సన్ దూసుకు వచ్చాడు. వేగంగా ఫినిషింగ్ లైన్ దాటేశాడు. సెకండ్ వ్యవధిలో జాక్సన్ కార్సన్ ను దాటేశాడు. ఏకంగా స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో కార్సన్ వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి కార్సన్ సంబరాలు జరుపుకున్నాడు. చివరికి చేతులారా బంగారు పతకాన్ని పోగొట్టుకున్నాడు.

కార్సన్ ఉదంతం కేవలం యాదృచ్ఛికంగా జరిగింది అనుకోడానికి లేదు.. ఎందుకంటే జీవితంలో ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ తక్కువ అంచనా వేయకూడదు.. తక్కువ చూడకూడదు.. మనల్ని మనం గొప్పగా అనుకోకూడదు.. ప్రతి సందర్భంలోనూ కష్టపడాలి. ఆ కష్టాన్ని చివరి వరకు కొనసాగించాలి. ఫలితం ఎలాంటిదైనా పర్వాలేదు. మనం పడే శ్రమలో మాత్రం నిజాయితీ తగ్గకూడదు.. అప్పుడే విజయం అనేది మనకు దరి చేరుతుంది. అలాకాకుండా అహం మొత్తాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగితే.. ఇదిగో చివరికి కార్సన్ లాగా మిగిలిపోతారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular