Marriages : సంచలన సర్వే : వచ్చే 60 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లు ఉండవట.. అంతా అదే పని.. ఎలా తయారవుతుందంటే?

ఈ పరిస్థితి 60 లేదా 70 ఏళ్ల వరకు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఏఐ రంగంలోకి వస్తే పరిస్థితుల్లో చాల మార్పులు ఉంటాయంటున్నారు.

Written By: NARESH, Updated On : September 29, 2024 5:07 pm

After the next 60 years, there will be no real Marriages

Follow us on

Marriages : ప్రపచంలో ఇద్దరు తెలియని ఆడ, మగ వ్యక్తులు పెళ్లి అనే బంధంతోనే కలుస్తారు. ఈ భూమ్మీద వివాహాన్ని రకరకాల పద్దతులో నిర్వహిస్తుంటారు. ఎలా చేసినా ఈ బంధంతో దంపతులు జీవితాంతం కలిసి ఉండాలనే నిబంధనలు పెడుతారు. భారతదేశంలో వివాహ సంప్రదాయం కొన్ని పద్దతుల ద్వారా నిర్వహిస్తారు. వివాహ నిశ్చయం ముందే ఇరువురి అభిప్రాయాలు తెలుసుకొని వారిని ఒక్కటి చేస్తారు. ఆ తరువాత జీవితాంతం కలిసి ఉండేలా కొన్ని రూల్స్ పెడుతారు. అయితే కాలం మారుతున్న కొద్దీ వివాహ సంప్రదాయం మారిపోతుంది. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం నుంచి ప్రేమ పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు ఏకంగా లివింగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. ఈ పరిస్థితి మరో 70 ఏళ్ల వరకు ఎలా ఉంటుంది? అప్పుడు పెళ్లిళ్లు ఎలా చేసుకుంటారు?

కొందరు మానసిక నిపుణులు చెబుతున్న ప్రకారం మరో 60 నుంచి 70 ఏళ్లల్లో పెళ్లి వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది. రానున్న కాలంలో పెళ్లి గురించి యువత పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు. ప్రస్తుతం పెళ్లిపై ఎక్కువగా మనసు పెట్టడం లేదు. ఎక్కువగా కెరీర్, భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో 30 నుంచి 35 ఏళ్ల వరకు సెటిల్ అయిన తరువాతనే మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం పెళ్లిని పెద్దగా ఆడంబరంగా కాకుండా సింపుల్ గా చేసుకుంటున్నారు.

నేటి కాలంలో పెళ్లి గురించి యువత పెద్దగా ఆలోచించడం లేదు. ఒకవేళ తనకు వేరే వ్యక్తితో కలిసి ఉండాలని అనిపిస్తే లివింగ్ రిలేషన్ మెయింటేన్ చేస్తున్నారు. అలా కొన్నాళ్లపాటు కలిసి ఉండి వారితో ఇష్టం లేకపోతే విడిపోతున్నారు. అయితే ఈ పరిస్థితి రాను రాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. వివాహం గురించి పూర్తిగా పట్టించుకోకుండా అవసరం ఉన్నంత వరకు మాత్రమే కలిసి ఉండి ఆ తరువాత విడిపోయే అవకాశాలు ఉంటాయని కొందరు తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లకు పైగా ఉంది. ఇప్పటికే జననాల రేటు తగ్గిపోతుంది. ఇది రానున్న కాలంలో మరింత తగ్గిపోయి జనాభా తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

రానున్న రోజుల్లో ఏఐ యుగం నడిచే అవకశం ఉంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చాక.. మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రతీ పని కోసం మెషిన్ ను సంప్రదించే రోజులు రాబోతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో మనుషులతో అవసరం లేకుండా కొన్నిపనులు చేసే అవకాశం ఉండనుంది.

అయితే మానవ సంబంధాలపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కొందరు తెలుపుతున్నారు. ఇప్పటికే చదువు, ఉద్యోగం పేరిట కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నారు. రానున్న రోజుల్లో హైస్కూల్ చదువు కూడా కుటుంబాన్ని విడిచిపెట్టి చదివే రోజులు రానున్నాయి. అంతేకాకుండా మనుషులు మాట్లాడుకోవడం ఆపేసి ఎక్కువగా పనుల్లోనే మునిగిపోతారని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి 60 లేదా 70 ఏళ్ల వరకు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఏఐ రంగంలోకి వస్తే పరిస్థితుల్లో చాల మార్పులు ఉంటాయంటున్నారు.