https://oktelugu.com/

Viral Video: పాము నోట్లో నాలుక పెట్టిన యువకుడు.. వైరలవుతున్న వీడియో!

సోషల్ మీడియాలో వ్యూస్ సంపాదించుకోవడానికి కొత్తగా ట్రై చేస్తుంటారు. ఎంత కష్టమైనవి అయిన చేస్తుంటారు. ఈక్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతారు. అయితే పాముతో ఆటలు ఆడటం సామాన్య విషయం కాదు.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 13, 2024 / 08:50 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video: పాములంటే సాధారణంగా ఎవరికైనా భయం ఉంటుంది. వీటిని రియల్‌గా చూసినప్పుడు భయపడటంతో పాటు కొందరు సినిమాల్లో చూసినప్పుడు కూడా భయపడుతుంటారు. అలానే వీటిని పూజిస్తారు కూడా. అయితే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఈమధ్య చాలామంది డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు పాము నోట్లో నాలుక పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పాములతో కొందరు ఆటలు ఆడతారు. వాటిని పెంచుతుంటారు. అయితే ఇవి కాటేయకుండా జాగ్రత్త పడతారు. మనదగ్గరికి వస్తే కాటేస్తాయని చాలా భయపడతారు. కానీ ఈ యువకుడు మాత్రం పాము కాటేస్తాదని అని భయపడకుండా దాని నోట్లో నాలుక పెట్టాడు. ఎవరైనా పెంపుడు జంతువులతో ఇలా దగ్గరగా ఉండటం చూస్తుంటాం. కానీ ఈ యువకుడు ఏకంగా పాము నోట్లో నాలుక పెట్టాడు. అసలు ఏంటి దీని స్టోరీ.

    సోషల్ మీడియాలో వ్యూస్ సంపాదించుకోవడానికి కొత్తగా ట్రై చేస్తుంటారు. ఎంత కష్టమైనవి అయిన చేస్తుంటారు. ఈక్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతారు. అయితే పాముతో ఆటలు ఆడటం సామాన్య విషయం కాదు. పొరపాటున అది కాటేస్తే ఇక అంతే సంగతులు. అలాంటి ఆ యువకుడు పాముతో మెల్లగా ఆడుకుంటూ నోట్లోకి నాలుక పెడతాడు. మొదట చేతులతో ఆడుకుంటాడు. ఆ తర్వాత తన చేతులతో దగ్గరికి తీసుకుని పాము నోట్లో నాలుక పెడతాడు. పాము అతని నాలుకను ముట్టుకునేలోగా అతను తన నాలుకను లోపలికి పెట్టేస్తాడు. ఇలా పాముతో సరసాలు ఆడుతాడు. ఆ తర్వాత పాము అతని నాలుకను టచ్ చేస్తుంది. అయితే పాముకి విషం తీసేసి ఇలా వీడియో తీసి ఉండవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    ఈ వైరల్ వీడియోకి వ్యూస్ బాగా వచ్చాయి. అయితే ఇలా పాములతో ఆడటం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం మానుకోవాలని అంటున్నారు. ఇలా రిస్క్ చేసి వీడియోలు చేసిన వాళ్లు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫేమస్ కావాలని రీల్స్ చేయడం అనేది వాళ్ల ఇష్టం కానీ. ప్రాణాలు తెగించి చేయడం వల్ల అది మీ ప్రాణాల మీదకే వస్తుంది. మళ్లీ రీల్స్ చేయడానికి కనీసం ప్రాణాలైన ఉండాలి కదా. కాబట్టి చేసే ముందు జాగ్రత్త వహించి చేయడం బెటర్.