America: హెచ్ఐవీ సోకిందని తెలిసి రెచ్చిపోయి చేసింది.. 211 మందికి ఇలా అంటించేసింది*

అమెరికాలోని బహాయో రాష్ట్రంలోని మరియెట్టాలో లిండా లిచ్చాసే అనే మహిళ సెక్స్ వర్కర్ గా పని చేస్తోంది. ఆమెకు 2022లో హెచ్ఐవి సోకింది.

Written By: Dharma, Updated On : May 24, 2024 6:24 pm

America

Follow us on

America: నాకు దక్కనిది.. మరొకరికి దక్కనీయను అంటూ ఆ మధ్యన వచ్చిన మగధీర సినిమాలో విలన్ హీరోయిన్ ను చంపేస్తాడు. సరిగ్గా ఇటువంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. తనకు హెచ్ఐవి సోకిన విషయం తెలుసుకున్న మహిళ.. ఏకంగా 211 మందికి హెచ్ఐవి ని అంటగట్టింది. హెల్త్ అలర్ట్ కు కారణమైంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని బహాయో రాష్ట్రంలోని మరియెట్టాలో లిండా లిచ్చాసే అనే మహిళ సెక్స్ వర్కర్ గా పని చేస్తోంది. ఆమెకు 2022లో హెచ్ఐవి సోకింది. కానీ ఆమె సెక్స్ వర్కర్ గా కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె షాకింగ్ విషయాలు చెప్పింది. హెచ్ఐవి నిర్ధారణ అయిన తర్వాత 211 మందితో సన్నిహితంగా గడిపినట్లు.. వారితో సెక్స్ చేసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు హెల్త్ అలర్ట్ ప్రకటించారు. ఆమెతో సన్నిహితంగా గడిపిన వారి ఫోన్ నెంబర్లను గుర్తించి వారిని అలెర్ట్ చేసే పనిలో పడ్డారు.

అయితే దర్యాప్తులో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు హెచ్ఐవి ఉందని తెలిసినా.. ఇతరులను అంటగట్టడం ద్వారా ఆమె పైశాచిక ఆనందం పొందినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయారా అంటూ పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. వారిని ఆసుపత్రులకు తరలించి.. వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అత్యవసర వైద్యం అందిస్తున్నారు. తాను ఒక్కదాన్నే కాకుండా.. తనతో పాటు అందరూ కూడా మునిగిపోవాలన్న ఆ మహిళ ఆలోచనను ఎక్కువమంది తప్పు పడుతున్నారు.