Hanuman Mandir Kullu: ఏకధాటిగా వర్షం.. బీభత్సంగా వరద.. మిన్ను మన్ను ఏకం అయ్యేలాగా ప్రవహిస్తోంది. పెద్ద పెద్ద గుట్టల నుంచి బండరాళ్లు కిందికి దొర్లి వస్తున్నాయి. భారీ భవంతులు చిగురుటాకు లాగా వణికి పోతున్నాయి. చూస్తుండగానే నష్టం అపారంగా ఉంది. చాలామంది తమ ఇళ్ళను వదిలేసి బతుకు జీవుడా అనుకుంటూ పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్నారు. క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిలువ నీడ కోసం తపించిన వారు ఎంతోమంది.
Also Read: ఓడిపోయినోడ్ని ‘అగ్నిపరీక్ష’ కి జడ్జిగా పెడతారా..? నవదీప్ పై రెచ్చిపోయిన కౌశల్!
అలాంటి పరిస్థితులు ఉన్నచోట ఒక గుడికి ఏమీ కాలేదు. అలాగని ఆ గుడి పటిష్టంగా నిర్మించలేదు. భారీ హంగులతో ఏర్పాటు చేయలేదు. సాధారణమైన ఇనుప కమ్మీలతో.. నిర్మించారు. కాకపోతే అందులో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ స్థాయిలో వరదలు వచ్చినప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రస్థాయిలో ప్రభావితమైనప్పటికీ.. హనుమంతుడి గుడికి మాత్రం ఏమీ కాలేదు. పైగా ఆ గుడి అత్యంత పటిష్టంగా ఉండడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారం కావడంతో సంచలనం నమోదవుతోంది.
హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉండే రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రమాదకరస్థాయిలో వరదలు ప్రవహిస్తున్నాయి. ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. అదే స్థాయిలో ప్రాణ నష్టం కూడా ఉంది. అయితే ఈ రాష్ట్రంలో కులు అనే ప్రాంతంలో హనుమాన్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చాలా సంవత్సరాల క్రితం నిర్మించారు. అయితే ఈ ఆలయం భారీ ప్రాకారాలతో.. దృఢమైన స్తంభాలతో కాకుండా.. సాధారణంగానే నిర్మించారు. ఆలయం చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాలు వరదలకు కొట్టుకుపోతే.. దీనికి మాత్రం ఏమీ కాలేదు. పైగా ఆ ఆలయం వద్ద ఓ పూజారి అక్కడే ఉండి.. వరదలను పర్యవేక్షించారు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. పటిష్టంగా ఉన్న ఆలయాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు.. దేవుడు ఉన్నాడని.. ప్రకృతి విపత్తులు ఇలాంటివి ఎన్ని చోటు చేసుకున్నా ఆయన ఆలయానికి ఏమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram