Snakes : అంతుబట్టని రహస్యం.. ఆ దేశాల్లో ఒక్క పాము కనిపించని వైనం

సెయింట్ పాత్రిక అనే వ్యక్తి ఆ దేశంలో పాములన్నింటినీ చంపేశాడని స్థానికులు నమ్మకంగా చెబుతారు. ఓ సాధువు 40 రోజులపాటు ఉపవాసం ఉన్న సమయంలో పాములు కాటేశాయని.. దీంతో ఆగ్రహించిన ఆయన పాములను సముద్రంలోకి తరిమేశా డని మరో కథనం ఉంది. అయితే ఆ దేశ ప్రజలు మాత్రం ఆన్లైన్లో పాములను వీక్షిస్తూ ఆనందిస్తుంటారు.

Written By: NARESH, Updated On : April 23, 2024 6:24 pm

A single snake is not seen in those countries

Follow us on

Snakes : భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ఒకటి. అన్ని పాములు ప్రమాదకరం కావు. అవి భయంతోనే కాటు వేస్తుంటాయి. ప్రాణాలను బలి గొంటాయి. కొన్ని పాములను చూస్తే మనుషులతో పాటు జంతువులు కూడా అల్లంత దూరం వెళ్లిపోతాయి. అన్ని పాములు ప్రమాదకరం కానప్పటికీ.. కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రాణాంతకమైనవి. పాములతో చెలగాటం మంచిది కాదు. అవి కాటు వేసిన వెంటనే చికిత్స చేసుకోవాలి. లేకుంటే మూల్యం తప్పదు. మన దేశంలో ఏటా పాముకాటుతో వేలాది మంది మృతి చెందుతున్నారు. అందులో రైతులే అధికం. ప్రపంచంలో ప్రతి దేశంలో పాములు కనిపిస్తాయి. కానీ ఓ దేశంలో మాత్రం చూద్దామన్న కనిపించవు. అదే న్యూజిలాండ్.

పాములు లేని దేశం గా న్యూజిలాండ్ గుర్తింపు పొందింది. ఎక్కడైనా పామును చూద్దామంటే మచ్చుకైనా కానరావు. దీని భౌగోళిక కారణాల వల్ల ఇక్కడ ఒక్క పాము కూడా కనిపించదు. సాధారణంగా పాములు చల్లని ప్రదేశంలో మన లేవు. న్యూజిలాండ్ దక్షిణ ధ్రువాలకు దగ్గరగా ఉంటుంది. అక్కడ మంచు విపరీతంగా ఉంటుంది. పైగా న్యూజిలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది. అక్కడక్కడ చిన్నచిన్న దీవులు ఉంటాయి. వాటిల్లో మాత్రం లెక్కలేనన్ని పాములు కనిపిస్తుంటాయి. ఆ దీవుల నుంచి ఈదుతూ న్యూజిలాండ్ చేరుకోవాలంటే పాములకు అతి కష్టమైన పని. అందుకే అవి అక్కడకు చేరుకోలేవు.

అయితే పాముల విషయంలో న్యూజిలాండ్ సైతం పక్కాగా నిబంధనలు పాటిస్తోంది. ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి పాములను తెచ్చి పెంపుడు జంతువులుగా పెంచుకోవడం, విదేశాల నుంచి తీసుకురావడం కూడా నిషేధం. దేశంలో ఇతర ప్రాణులు, పక్షులకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ చట్టం తీసుకొచ్చారు. అందుకే న్యూజిలాండ్ లోని ఏ పార్కులోనూ పాము కనిపించదు. పసిఫిక్ మహాసముద్రం లో నైరుతి భాగంలో న్యూజిలాండ్ ఉంటుంది. ఇది భారీ ఖండంగా పిలిచే గోండ్వానాల్యాండ్ నుంచి విడిపోయింది. అయితే న్యూజిలాండ్ మాదిరిగానే ఐర్లాండ్ లో కూడా పాములు కనిపించవు. న్యూజిలాండ్లో పాములు కనిపించక పోవడానికి రకరకాలైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సెయింట్ పాత్రిక అనే వ్యక్తి ఆ దేశంలో పాములన్నింటినీ చంపేశాడని స్థానికులు నమ్మకంగా చెబుతారు. ఓ సాధువు 40 రోజులపాటు ఉపవాసం ఉన్న సమయంలో పాములు కాటేశాయని.. దీంతో ఆగ్రహించిన ఆయన పాములను సముద్రంలోకి తరిమేశా డని మరో కథనం ఉంది. అయితే ఆ దేశ ప్రజలు మాత్రం ఆన్లైన్లో పాములను వీక్షిస్తూ ఆనందిస్తుంటారు.