Viral Video : బలగం సినిమా చూశారా.. అందులో మూలుగు బొక్క కోసం కుటుంబాల మధ్య కొట్లాటలు జరుగుతాయి. అవి అంతరాలకు దారి తీస్తాయి.. ఎన్నో సంవత్సరాల తర్వాత.. అనేక పంచాయితీల తర్వాత వారు కలిసిపోతారు. అప్పట్లో ఆ సినిమా వచ్చినప్పుడు మూలుగ బొక్క కోసం కూడా గొడవలు జరుగుతాయా? అని చాలామంది విస్మయం వ్యక్తం చేశారు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలలో అటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అది ఏకంగా కొట్లాటకు దారితీసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరేలి జిల్లాలోని నవాబ్ గంజ్ ప్రాంతంలోని సర్తాజ్ మ్యారేజ్ హాల్లో ఓ పెళ్లి జరిగింది. అనంతరం వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో భాగంగా బిర్యానీ వడ్డించారు. ఆ బిర్యానీలో తమ తరఫు వారికి ఒక్క చికెన్ లెగ్ పీస్ కూడా రాలేదని వరుడి తరఫు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కేవలం బిర్యాని రైస్ మాత్రమే వడ్డించారని.. చికెన్ వడ్డించే విషయంలో పక్షవాతం చూపించాలని వరుడి తరఫున వారు ఆరోపించారు. వధువు తరుపున వారిపై ఘర్షణకు దిగారు. చిన్నగా మొదలైన ఈ వివాదం.. ఆ తర్వాత పరస్పరం దాడులకు దారితీసింది. అయితే ఈ ఘర్షణలో వివాహానికి వచ్చిన అతిథులు పరస్పరం కొట్టుకున్నట్టు తెలుస్తోంది. వినడానికి వీలు లేని విధంగా బూతులు తిట్టుకొని.. కొట్టుకున్నారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ప్లాస్టిక్ కుర్చీని మరొక వ్యక్తిపై విసిరి వేసినట్టు కనిపిస్తోంది. ఈ గొడవ ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో వరుడు కోపోద్రిక్తుడయ్యాడు. ఈ పందిరిలో తాను పెళ్లి చేసుకోనని ప్రకటించాడు. దీంతో గొడవ ఒక్కసారిగా ఆగింది. తర్వాత వధువు కుటుంబ సభ్యులు వరుడిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. చివరికి మనసు మార్చుకున్న ఆ వరుడు వధువు మెడలో తాళికట్టాడు. దీంతో ఆ గొడవకు శుభం కార్డు పడింది.
A brawl erupted at a wedding when there were no chicken leg pieces in the biryani.
The groom & his wedding guests were severely beaten for #Chicken leg piece !
Bareilly, Uttarpradesh
pic.twitter.com/KXwmMGUNnT— Ashwini Shrivastava (@AshwiniSahaya) June 24, 2024