Karnataka: మన అవసరం ఆధారంగానే వస్తువుకు విలువ ఉంటుంది. మనం వాడుకున్న విధానాన్ని బట్టి వస్తువు అవసరం మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని వస్తువులను మనం వాడిన తర్వాత పక్కన పెడతాం. వాడుకలో ఉండదు కాబట్టి వస్తువు కూడా పాతబడిపోతుంది.. ఆ తర్వాత తుప్పు పట్టి పాత ఇనుప సమాను దుకాణానికి వెళుతుంది.
ఒక ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చిన తర్వాత విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాలం గడుస్తున్నా కొద్దీ ఆ ఉత్పత్తికి రేటు పడిపోతూ ఉంటుంది. మార్కెట్లోకి కొత్త ఉత్పత్తి వస్తే పాత దానికి డిమాండ్ తగ్గుతూ ఉంటుంది. ఇది బిజినెస్ సూత్రం. అయితే కొన్ని సందర్భాలలో పాత ఉత్పత్తులకు కూడా డిమాండ్ అమాంతం పెరుగుతుంది. అది కాస్త ఊహించని ధర పలుకుతుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి ఒక పాత వస్తువు ద్వారా జాక్పాట్ జరిగింది.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తన కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లో బ్యాంకు లోన్ తీసుకుని మారుతి 800 కారు కొనుగోలు చేశాడు. దానిని చాలా రోజులపాటు ఉపయోగించాడు. ఆ తర్వాత పక్కన పెట్టాడు.. అప్పట్లో ఈ కారును ఆయన 1.10 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత దానిని విక్రయించాడు. అతడి ఆర్థిక స్థాయి అంతకంతకు పెరిగింది. ఎన్నో విలాసవంతమైన కార్లు ఆయన గ్యారేజీ లోకి వచ్చాయి. అన్నింట్లోనూ తిరిగినప్పటికీ మారుతి 800 లభించిన సౌకర్యం.. ఆ అనుభూతి అతడికి కలగలేదు. దీంతో తన కెరియర్ తొలి రోజుల్లో బ్యాంకు లోను తీసుకుని మరీ కొనుగోలు చేసిన మారుతి 800 కారును తిరిగి పొందాలి అనుకున్నాడు. ఇందులో భాగంగా ఇన్ స్టా లో ఆఫర్ ఇచ్చాడు. దానిని తిరిగి తెచ్చిన వారికి పది లక్షల బహుమతి అందిస్తానని ప్రకటించాడు.
ఈ ప్రకటనకు చాలామంది స్పందించారు. కొంతమంది వ్యక్తులు ఆయన ఇచ్చిన వివరాల ఆధారంగా కర్ణాటక మొత్తం తిరిగారు. చివరికి ఒక వ్యక్తి దగ్గర ఈ కారు లభించింది. ఆ కారును అతని వద్ద నుంచి కొనుగోలు చేసి.. ఈ వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చారు. అతడు చెప్పినట్టుగానే 10 లక్షలు వారికి ఇచ్చాడు. వాస్తవానికి ఆ కారును ఓ వ్యక్తి 20 వేలకు కొనుగోలు చేశాడు.. అతడికి ఈ వ్యక్తులు ఐదు లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారు. 20,000 పెట్టి కొనుగోలు చేస్తే 5,00,000 రావడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేవు లేవు.