80-year-old Woman Shocking video: పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. ఆ మాట ఎందుకు అంటారో.. పదే పదే దానిని ఎందుకు గుర్తు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పెద్దల అనుభవం గొప్పది అంటారు. అది అనేక సందర్భాల్లో నిరూపితం అవుతూనే ఉంటుంది. తాజాగా కూడా నిరూపితమైంది.. దానికి సంబంధించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.
నేటికీ గ్రామాల్లో పొద్దును చూసి వర్షం వస్తుందో? లేదో? చెప్పే పెద్దలు చాలామంది ఉంటారు. సూర్యుడి అస్తమించే విధానాన్ని బట్టి కాలం ఎలా ఉంటుందో చెబుతుంటారు. ఏ వాతావరణం లో ఎలాంటి పంటను వెయ్యాలి.. ఏ నేలలో ఎటువంటి పంటను సాగు చేస్తే లాభాలు వస్తాయో.. చెబుతుంటారు. అందువల్లే గ్రామీణ ప్రాంతాలలో పెద్దలు చెప్పినట్టుగానే వారి సంతానం నడుచుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వారి మాటలకు వ్యతిరేకంగా వ్యవసాయం చేస్తే నష్టాలు ఎదురవుతుంటాయి. ఇప్పటికీ కొంతమంది పంట పొలాలలో వేప కషాయం.. ఇతర పత్రాలతో రూపొందించిన ద్రవాలను వేస్తుంటారు. దానివల్ల దిగుబడి అధికంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. పెద్దలకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. పండే పంటమీద.. కురిసే వర్షం మీద.. పారే నది మీద.. ఇలా ప్రతిదానిమీద సంపూర్ణమైన స్పష్టత ఉంటుంది. అందువల్లే వారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే జీవించారు. జీవించగలుగుతున్నారు.
తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి లో విపరీతంగా వర్షం కురిసింది. కురిసిన వర్షానికి ఓ వాగు బీభత్సంగా పారుతోంది. ఆవాగును దాటడానికి ఎవరూ సాహించడం లేదు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం వాగు ప్రవాహాన్ని అంచనా వేసుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుంటూ దాటింది. క్షేమంగా గమ్యాన్ని చేరింది. వాగును దాటే సందర్భంలో ఏమాత్రం భయపడలేదు. వెనకడుగు వేయలేదు. అదే ఆ వృద్ధురాలు కంటే ముందు ఓ యువకుడు వాగును దాటేందుకు ప్రయత్నించాడు. కొత్త దూరం వెళ్లగానే ప్రవాహాన్ని అంచనా వేయలేక వాగులో కొట్టుకుపోయాడు. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలోకి ఎక్కించారు. వరదను అంచనా వేసి ఓ వృద్ధురాలు ప్రాణాలను కాపాడుకుంటే.. దానిని అంచనా వేయలేక ఓ యువకుడు కొట్టుకుపోయాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే ఈ స్థాయిలో వరద వస్తున్నప్పుడు ఆ వృద్ధురాలు.. ఆ యువకుడు ఎందుకు రోడ్డు దాటారు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. ఆ మాట ఎందుకు అంటారో.. పదే పదే దానిని ఎందుకు గుర్తు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పెద్దల అనుభవం గొప్పది అంటారు. అది అనేక సందర్భాల్లో నిరూపితం అవుతూనే ఉంటుంది. తాజాగా కూడా నిరూపితమైంది.. దానికి సంబంధించిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.
నేటికీ గ్రామాల్లో పొద్దును చూసి వర్షం వస్తుందో? లేదో? చెప్పే పెద్దలు చాలామంది ఉంటారు. సూర్యుడి అస్తమించే విధానాన్ని బట్టి కాలం ఎలా ఉంటుందో చెబుతుంటారు. ఏ వాతావరణం లో ఎలాంటి పంటను వెయ్యాలి.. ఏ నేలలో ఎటువంటి పంటను సాగు చేస్తే లాభాలు వస్తాయో.. చెబుతుంటారు. అందువల్లే గ్రామీణ ప్రాంతాలలో పెద్దలు చెప్పినట్టుగానే వారి సంతానం నడుచుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వారి మాటలకు వ్యతిరేకంగా వ్యవసాయం చేస్తే నష్టాలు ఎదురవుతుంటాయి. ఇప్పటికీ కొంతమంది పంట పొలాలలో వేప కషాయం.. ఇతర పత్రాలతో రూపొందించిన ద్రవాలను వేస్తుంటారు. దానివల్ల దిగుబడి అధికంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. పెద్దలకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. పండే పంటమీద.. కురిసే వర్షం మీద.. పారే నది మీద.. ఇలా ప్రతిదానిమీద సంపూర్ణమైన స్పష్టత ఉంటుంది. అందువల్లే వారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే జీవించారు. జీవించగలుగుతున్నారు.
తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి లో విపరీతంగా వర్షం కురిసింది. కురిసిన వర్షానికి ఓ వాగు బీభత్సంగా పారుతోంది. ఆవాగును దాటడానికి ఎవరూ సాహించడం లేదు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం వాగు ప్రవాహాన్ని అంచనా వేసుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుంటూ దాటింది. క్షేమంగా గమ్యాన్ని చేరింది. వాగును దాటే సందర్భంలో ఏమాత్రం భయపడలేదు. వెనకడుగు వేయలేదు. అదే ఆ వృద్ధురాలు కంటే ముందు ఓ యువకుడు వాగును దాటేందుకు ప్రయత్నించాడు. కొత్త దూరం వెళ్లగానే ప్రవాహాన్ని అంచనా వేయలేక వాగులో కొట్టుకుపోయాడు. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలోకి ఎక్కించారు. వరదను అంచనా వేసి ఓ వృద్ధురాలు ప్రాణాలను కాపాడుకుంటే.. దానిని అంచనా వేయలేక ఓ యువకుడు కొట్టుకుపోయాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే ఈ స్థాయిలో వరద వస్తున్నప్పుడు ఆ వృద్ధురాలు.. ఆ యువకుడు ఎందుకు రోడ్డు దాటారు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
వైరల్ వీడియో..!
వరదను అంచనా వేస్తూ వాగును దాటిన 80 ఏండ్ల వృద్ధురాలు.. అవగాహన లేక వరదలో గల్లంతైన 23 ఏండ్ల యువకుడు
యాదాద్రి జిల్లాలో ఘటన pic.twitter.com/ST8Ktl5Ver
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2025