Homeఎడ్యుకేషన్UK: నెలకు లక్షన్నర ఉంటేనే యూకేలో చదువు.. భారతీయ విద్యార్థులకు షాక్ లగా

UK: నెలకు లక్షన్నర ఉంటేనే యూకేలో చదువు.. భారతీయ విద్యార్థులకు షాక్ లగా

UK: విదేశాల్లో ఉన్న తచదువులు చదవాలనే కోరిక విద్యార్థుల్లో ఏటా పెరుగుతోంది. దీనికి తల్లిదండ్రులు, ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. దీంతో ఉన్నత చదువుల కోసం విదేశాలబాట పట్టే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భారతీయ విద్యార్థులు విదేశీ విద్య కోసం వెళ్లే దేశాల్లో అమెరికా ముందు వరుసలో ఉంటుంది. తర్వాత కెనడా, యూకే, ఆస్ట్రేలియా ఉన్నాయి. వీటితోపాటు జపాన్, బ్రెజిల్, చైనా, ఉక్రెయిన్‌ తదితర దేశాలకు కూడా వెళ్తున్నారు. తమ దేశాలకు వచ్చే విదేశీ విద్యార్థులు పనెరుగుతుండడంతో చాలా దేశాలు నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. అద్దెలు, యూనివర్సిటీ ఫీజులు పెంచుతున్నాయి. చదువుకుంటూ ఉద్యోగం చే సే అవకాశాలను తగ్గిస్తున్నాయి. దీంతో దాని ప్రభావం భారతీయ విద్యార్థులపై పడుతుంది. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా నిబంధనలు కఠినతరం చేశాయి. ఇప్పుడు యూకే కూడా అదేబాట పట్టింది. నిబంధనలను సవరించింది.

విద్యార్థులపై భారం..
ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చే విద్యార్థులపై బ్రిటన్‌ ప్రభుత్వం మరింత భారం మోపింది. చదువు కొనసాగుతున్న సమయంలో విద్యార్థులు తమ నెలవారీ ఖర్చులకు అయ్యే నిధులు పరిమితిని పెంచింది. కోర్సు కొనసాగుతున్న సమయంలో నిర్ధిష్ట మొత్తం తమవద్ద ఉందని చెప్పడానికి తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. వ్యయ పరిమితిని పెంచడం 2020 తర్వాత ఇదే తొలిసారి.

2025, జనవరి నుంచి..
బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థికంగా ఎలాంటి ఆటంకం కలుగకూడదని బ్రిటన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే నూతన నిబంధనలు రూపొందించింది. ఇందలో భాగంగా లండన్‌లో ఉన్నత విద్య కోసం ప్రణాళిక వేసుకుంటున్న వారు నెలకు 1,483 పౌండు(రూ.1.64 లక్షలు) సేవింగ్స్‌ రూపంలో తమ ఖాతాలో ఉన్నట్లు చూపించాలి. లండన్‌లో చదువుకునే విద్యార్థుల నెలవారీ ఖర్చును 1,136 పౌండ్లు(రూ.1.25 లక్షలు)గా అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రూల్స్‌ 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయి.

వీసా సమయంలో రూ.14,77 లక్షలు..
ఇదిలా ఉంటే.. లండన్‌లో 9 నెలలు అంతకన్నా ఎక్కువ కాలం చదువుకునే వారు.. వీసా సమయంలో తమ ఖాతాలో రూ.14.77 లక్షల సేవింగ్స్‌ చూపించాల్సి ఉంటుంది. బ్రిటన్‌లో జీవన వ్యయం భారీగా పెరుగతోంది. దీనికి అనుగుణంగా అంతర్జాతీయ విద్యార్థుల నెలవారీ ఖర్చుల అంచనాలను అక్కడి ప్రభుత్వం సవరించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular