TANA Health Camp : ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అమెరికాలో తెలుగువారి ఐక్యతకు కృషి చేస్తున్న అతిపెద్ద సంస్థ. సుమారు ఐదు దశాబ్దాలుగా అమెరికాలోని తెలుగు ప్రజలను ఏకం చేస్తోంది. సభ్యులను పెంచుకుంటూ విస్తరిస్తోంది. కొత్తగా అమెరికా వెళ్లే తెలుగువారికి సహాయం అందిస్తున్నారు. స్థానిక చట్టాలు, వీసా నిబంధనలుపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక తెలుగు పండుగలు, వేడుకలు, సంస్కృతి, సంప్రదాయాన్ని చాటే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక సమస్యల్లో ఉన్నవారికి తానా అండగా నిలుస్తోంది ఈ క్రమంలోనే అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. అనాథలకు, పేద చిన్నారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ తానా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద పిల్లలకు పుస్తకాలు, ఆర్థికసాయం, ఉన్నత విద్యకు సహకారం, ప్రోత్సహక బహుమతులు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఉచితంగా చికిత్స, ఆపరేషన్లు చేయిస్తోంది. తాజాగా తానా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అక్టోబర్ 6న వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
మెగా హెల్త్ క్యాంప్..
హైదరాబాద్‌లో తానా ఆధ్వర్యంలో అక్టోబర్6(ఆదివారం) మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 550 మందికి ఉచితంగా వైద్యపరీక్షలు చేశారు. ప్రతీనెల మొదటి ఆదివారం హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ ప్రసాద్ నల్లూరి రోగులకు పరీక్షలు చేశారు. తానా తరఫున సంస్థ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ శిబిరాన్ని పర‍్యవేక్షించారు. అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి గచ్చిబౌలి, శేర్‌లింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల మురికివాడల నుంచి 550 మంది హాజరయ్యారు.
26 మంది వైద్యులు..
ఇదిలా ఉంటే.. ప్రతీనెల మొదటి ఆదివారం నిర్వహించే ఈ శిబిరం కోసం 26 మంది వైద్యులు పనిచేస్తున్నారు. రొటేషన్ పద్దతిలో వీరు సేవలు అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆర్థోపెడిక్, డయాబెటిక్, గైనకాలజీ, పీడియాట్రిషన్ ఇతర విభాగాలకు చెందిన వైద్యులు కన్సల్టెన్సీ సేవలు అందించారు. రోగులకు నెలకు సరిపడా మందులు ఉచితంగా అందించారు. శిబిరానిన విజయవంతం చేసిన వారికి తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కోరార్డినేటర్ శ్రీనివాస్ యెండూరి కృతజ్ఞతులు తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ ప్రసాద్ నల్లూరి కొంత మందికి వైద్య పరీక్షలు చేశారు.