TANA : తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

TANA : తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ ప్రభుత్వ పాఠశాలలకు కాలినడకన 6 కి.మీలు నడిచి వస్తున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకున్నాడు తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ.

ఖమ్మం రఘునాధపాలెం మండలంలోని. వి. వెంకటాయపాలెం హైస్కూలులో 6 కిలోమీటర్లు దూరం నుండి నడిచి వచ్చే ఆరుగురు బాలికలకు ‘తానా ఆదరణ’ కార్యక్రమంలో 6 సైకిళ్ళు అందజేశారు. పాఠశాల లో జరిగిన ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మైన్ యార్లగడ్డ వెంకట రమణ గారు సైకిళ్ళుతో పాటు 10తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఎక్సామినేషన్ కిట్స్ అందజేసారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్ బండి నాగేశ్వరరావు గారు, ఇతర తానా ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థులు తానా చేస్తున్న కృషికి వితరణకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

సైకిళ్లు అందుకున్న వారిలో నగర శివారు వెలుగుమట్ల సాగర్ కాల్వపై నివసించే ఐదుగురు, వేపకుంట్లకు చెందిన ఒక విద్యార్థిని ఉన్నారు. వీరు ఈ పాఠశాలలో ఆరు, ఏడు తరగతులు చదువుతున్నారు. వారు పాఠశాలకు వచ్చివెళ్లేలా ఉపయోగపడేందుకు తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ చేతుల మీదుగా సైకిళ్లు అందించారు.

ఈ కార్యక్రమంలో డీఎన్ఎఫ్ అధ్యక్షులు బండి నాగేశ్వరరావు, హెచ్ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Get notified whenever we post something new!

Continue reading

Rakul Preet Singh : ‘సూర్పనక గా రకుల్ ప్రీత్ లుక్ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి..

Rakul Preet Singh : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీ లోకి ఈమె అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో తప్ప, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి...

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్ బాల్ ప్లేయర్ కహాని ఏంటో తెలుసా..

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా నిలవడంలో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్థిరమైన ప్రదర్శన చేసి సత్తా చూపించాడు. మైదానంలో పాదరసం లాగా...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచిక (Investment Friendliness Index) కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version