TANA Chaitanya Sravanthi : ‘తానా’ సేవకు ప్రతిరూపంగా మారుతోంది.. అమెరికాలో ఉన్న ప్రవాస తెలుగువారు సామాజికసేవలో తరిస్తున్నారు. కళలకు జీవం పోస్తున్నారు. అంతరించిపోతున్న భారతీయ కళలను ప్రజలకు చేరువ చేయాలనేదే తమ లక్ష్యంగా పనిచేస్తున్నారు. గ్రామీణ కళలు, జానపద నృత్య ప్రదర్శనలు మరుగున పడిపోకుండా, కళాకారులను ప్రోత్సాహిస్తూ గ్రామీణ ఆట పాటలు, సంగీత సాహిత్య సాంస్కృతిక కళల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ వారు సాంస్కృతిక కళోత్సవాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఏపీలోనూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ దగ్గరలోని తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ‘తానా’ ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి పాల్గొని మాట్లాడారు. తానా చేస్తున్న అనేక సహాయ కార్య క్రమాలు వివరించారు. 2 డిసెంబర్ నుంచి 4 జనవరి వరకు జరిగే తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో జరిగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తానా ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించామని.. అందులో భాగంగానే కేఎల్ యూనివర్సిటీలో ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు , వారసత్వం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ‘తానా’ అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.
తానా ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డా.ఉమా ఆరమండ్ల కటికి గారిని సన్మానిస్తున్న తానా సభ్యులు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్
తానా కోఆర్డినేటర్ రాజా కుసుమతి మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను తానా చేపడుతోందన్నారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు సంప్రదాయాన్ని ఎవరూ విడనాడకూడదనే తమ ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గుడివాడ లో తానా చైతన్య స్రవంతి కార్య క్రమంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్,, గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు గారు, రామ్ వెనిగళ్ల గారు, శ్రీ వర్ల కుమార్ రాజ గారు, రోటరీ క్లబ్ గుడివాడ వారు పాల్గొన్నారు. శశికాంత్ వల్లేపల్లి అతిధులను వేదిక మీదకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి అమెరికా నుంచి వచ్చిన తానా నాయకులతో కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తానా ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి గారితోపాటు సతీష్ వేమూరి, పురుషోత్తం గూడె, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, జోగేశ్వర రావు పెద్దిబోయిన, టాగోర్ మలినేని, రాజ కాసుకుర్తి, Dr రావు మొవ్వా, శ్రీనివాస ఓరుగంటి. నాగ పంచుమర్తి , రఘు ఎద్దులపల్లి, తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి, TNI Live ఎడిటర్ ముద్దు కృష్ణ నాయుడు లని వేదిక మీదకు పిలిచి సత్కరించారు.
‘తానా, లీడ్ ద పాత్ ఫౌండేషన్’ సంయుక్త ఆధ్వర్యంలో ‘అమ్మానాన్నల’ పేర్ల మీద స్కాలర్ షిప్స్ కూడా పంపిణీ చేశారు. పేద పిల్లలకు ఈ ఆర్థికసాయం చేశారు. చేయూత స్కాలర్ షిప్ లు అందజేశారు.
స్కూల్ విద్యార్దిని లకు తానా చేయూత ద్వారా 55 మంది కి స్కాలర్ షిప్ లు అందించింది. తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్ లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ బహూకరించారు. ఐక్యాంప్, ఈఎంటీ క్యాంప్ , క్యాన్సర్ క్యాంప్ నిర్వహించారు.
శశికాంత్ వల్లేపల్లి , వారి తండ్రి, వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు గారు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ – రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి 850,000 రూపాయల వ్యయం తో వైకుంఠ రథం బహూకరించారు.
అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికాలో ఎవరి పనులు వారు చేసుకొంటూ, ఉద్యోగాలలో ఎదుగుతూ ఇంత పెద్ద స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు . వారికి ఇక్కడ ఉన్న మనం కూడా మన వంతు సహకారం ఇవ్వాలి అని సూచించారు.
తానా ఫౌండేషన్ చైర్మన్ వేంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ద్వారా ప్రతి సేవా కార్యక్రమానికి టార్గెట్స్ పెట్టుకొని వాటిని అధిగమిస్తున్నామని చెప్పారు. 1000 మందికి స్కాలర్ షిప్ లు ఇద్దామని అనుకొని ఇప్పటికే 1000 మంది ఇచ్చామని.. అలాగే 50 క్యాన్సర్ క్యాంప్ లు చేద్దామని టార్గెట్ పెట్టుకొని ఇప్పటికే 48 క్యాంప్ లు చేశామని తెలిపారు. ఈ విధంగా ప్రతి సేవా కార్యక్రమానికి ఒక నంబర్ టార్గెట్ పెట్టుకొని చేస్తున్నామని, ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటానికి మా వెనుక ఉన్న దాతలకు ధన్యవాదాలు తెలపాలని అన్నారు.
తానా సెక్రెటరీ సతీష్ వేమూరి మాట్లాడుతూ తానా టీమ్ స్క్వేర్ ద్వారా అమెరికాలో ఆపద, విపత్కర సమయాలలో ఏ విధంగా సహాయం చేస్తున్నామో వివరించారు.
ఈ కార్యక్రమంలో తానా ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి, కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పార్థసారథి వర్మ, ప్రొఫెసర్ వీసీ వెంకట్రామ్, రిజిస్ట్రర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.