Homeఅంతర్జాతీయంTANA Adopt Street Program : చార్లెట్‌లో ఘనంగా తానా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం

TANA Adopt Street Program : చార్లెట్‌లో ఘనంగా తానా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం

TANA Adopt Street Program : అమెరికాలోని చార్లెట్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తానా స్వర్ణోత్సవాల సందర్భంగా కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, సామాజిక బాధ్యత లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

‘గుడ్ నేబర్ డే’ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చార్లెట్ ప్రాంతానికి చెందిన తానా నాయకులతో పాటు 50 మంది పిల్లలు, 50 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. చార్లెట్ నగరంలోని ఆండ్రే కెల్ టామ్ షార్ట్ కూడలిలోని ఇరువైపుల రహదారులను తానా ప్రతినిధులు దత్తత తీసుకుని పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి చార్లెట్ హౌజింగ్ అండ్ నైబర్‌హుడ్ సర్వీసెస్ అధికారి జొనాథన్ హిల్ హాజరై తానా సభ్యులకు సూచనలు చేశారు. సమాజ సేవలో తానా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా తానా దత్తత తీసుకున్న రహదారుల వద్ద ప్రత్యేక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నవారికి అల్పాహారం, కాఫీ, టీ అందించారు. చార్లెట్ సిటీ కౌన్సిల్ మెంబర్ ఎట్ లార్జ్ డింపుల్ అజ్మీరా తానా చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇది అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ, స్వర్ణోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, చార్లెట్‌లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈవీపీ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని కూడా పాల్గొని అభినందనలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి తదితరులు కృషి చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version