Homeప్రవాస భారతీయులుNATS Volunteers Food Bank Service: సేవే గమ్యం.. నాట్స్‌ వాలంటీర్ల సామూహిక శ్రమతో.. ఫుడ్‌...

NATS Volunteers Food Bank Service: సేవే గమ్యం.. నాట్స్‌ వాలంటీర్ల సామూహిక శ్రమతో.. ఫుడ్‌ బ్యాంకులో 3 టన్నుల ఆహారం సిద్ధం!

NATS Volunteers Food Bank Service: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) మిస్సోరి చాప్టర్‌ అనాథలకు, చిన్నారులకు, వృద్ధులకు సేవ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా బ్రిడ్జన్‌లోని సెయింట్‌ లూయిస్‌ ఏరియా ఫుడ్‌ బ్యాంక్‌లో అరుదైన సేవా కార్యక్రమం నిర్వహించింది.. సుమారు 30 మంది తెలుగు వాలంటీర్లు కేవలం రెండు గంటల వ్యవధిలోనే 5,766 పౌండ్ల(సుమారు 2.62 టన్నుల) ఆహార పదార్థాలను వర్గీకరించి, ప్యాకింగ్‌ పూర్తి చేశారు. ఈ భారీ మొత్తంతో ఆహారం ఇప్పుడు పేద, నిరుపేద కుటుంబాలకు పంపిణీకి సిద్ధంగా ఉంది.

నాయకత్వం, సమన్వయం..
ఈ కార్యక్రమ విజయానికి నాట్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ రమేష్‌ బెల్లం, మిస్సోరి చాప్టర్‌ కోఆర్డినేటర్‌ సందీప్‌ కొల్లిపర, జాయింట్‌ కోఆర్డినేటర్‌ అన్వేష్‌ చాపరాల కీలకపాత్ర పోషించారు. వీరితోపాటు మధుసూధన్‌ దద్దాల, నరేశ్‌ రాయంకుల తదితర సభ్యులు చురుకైన పాత్ర పోషించారు. నాట్స్‌ చైర్మన్‌ కిశోర్‌ కంచర్ల, అధ్యక్షుడు శ్రీహరి మందడి వాలంటీర్ల కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

NATS Volunteers Food Bank Service
NATS Volunteers Food Bank Service

స్థానిక ఆహార భద్రతపై ప్రభావం
సెయింట్‌ లూయిస్‌ ఏరియా ఫుడ్‌ బ్యాంక్‌ ప్రతి నెలా 80కి పైగా ఆహార పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తూ, లక్షలాది మందికి ఆసరాగా నిలుస్తోంది. నాట్స్‌ వాలంటీర్లు సిద్ధం చేసిన ఈ 3 టన్నుల ఆహారం స్థానికంగా ఆహార కొరత ఎదుర్కొంటున్న కుటుంబాలకు గణనీయమైన ఊరటనిస్తుంది. తక్కువ సమయంలోనే ఇంత భారీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం పట్ల ఫుడ్‌ బ్యాంక్‌ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

‘భాషే రమ్యం, సేవే గమ్యం‘ అనే నినాదంతో ముందుకు సాగుతున్న నాట్స్, రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో స్థానిక సమాజానికి అండగా ఉంటామని మిస్సోరి చాప్టర్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం తెలుగు సమాజం సామాజిక బాధ్యతను, సేవా దృక్పథాన్ని చాటుకుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version