
ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించిన ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘ సేవకురాలు రాధిక మంగిపూడికి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ ప్రవాస తెలుగు పురస్కారం-2021 దక్కనుంది. దక్షిణాఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ యూరప్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 సంఘాల భాగస్వామ్యంతో 12 మంది తెలుగు వారిని ఎంపిక చేసి ప్రవాస తెలుగు పురస్కారాలు అందజేయనున్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారానికి ఎంపికైన కేవలం 12 మంది తెలుగు భాషాసేవకులలో తాను కూడా ఉండటం, తన కృషికి ఇంతడి చక్కటి గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని రాధిక తెలిపారు.